గుంటూరు
Monday, November 20, 2017 - 21:26

గుంటూరు : ఏపీ అసెంబ్లీ పనిదినాలను పొడిగించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లోనూ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల 25తోనే సమావేశాలు ముగియాల్సి ఉండగా.. మరిన్ని అంశాలపై చర్చించేందుకు వీలుగా సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 25న అసెంబ్లీకి సెలవు దినం కావడంతో... ఆ తర్వాత 27 నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.

Monday, November 20, 2017 - 21:25

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. గత వారం రోజుల్లో 26 వేల క్యూబిక్‌ మీటర్ల తవ్వకం పనులు, స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌కు సంబందించి 10 వేల 891 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేశామని.. అలాగే 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసినట్లు అధికారులు చంద్రబాబుకు తెలిపారు. మరో 12.04 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌...

Monday, November 20, 2017 - 19:08

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం అఖిలపక్షనేతలు కదం తొక్కారు. నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ప్రత్యేక హోదా విభజన హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వామపక్షాలు, వైసీపీ, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. అసెంబ్లీలో ప్రత్యేకహోదాపై తీర్మానం చేసి.....

Monday, November 20, 2017 - 18:52

గుంటూరు : నందిఅవార్డులపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈవ్యవహారం రచ్చ అవుతుందని అనుకులేదని ఆయన అన్నారు. ఇలా జరుగుతుందనుకుంటే ఐవీఆర్ఎస్ సర్వే చేయించి అవార్డులు ఇచ్చే వాళ్లమని తెలిపారు. ప్రతి విషయానికి కులం రంగు పులమడం సరికాదని ఆయన అన్నారు. జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే అవార్డులు ఇచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక పై అంశాల వారిగానే మాట్లాడాలని పార్టీ నేతలకు చంద్రబాబు...

Monday, November 20, 2017 - 12:50

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ అఖిలపక్ష నేతలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో వెలగపూడి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా మొహరించారు. అసెంబ్లీకి వచ్చే రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. వెలగపూడిలో పోలీసుల మొహరింపుపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

Monday, November 20, 2017 - 11:14

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. దీంతో గుంటూరు జిల్లాలో రాత్రి నుండి పోలీసులు నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో అసెంబ్లీని విజయవంతం చేస్తామంటున్న వామపక్షనేతలతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

Monday, November 20, 2017 - 11:09

గుంటూరు : వామపక్షాలు, ప్రజాసంఘాల చలోఅసెంబ్లీ నేపథ్యంలో అమరావతిలో భారీగా పోలీసులు మోహరించారు.  ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చిపోయే వాహనాల తనిఖీలతో ఖాకీలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వామపక్షనేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. ఈ సందర్భంగా వామపక్ష, వైసీపీ, ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. అరెస్టులను ఖండించారు. 
వైసీపీ నేత మల్లాది విష్ణు...

Monday, November 20, 2017 - 10:54

గుంటూరు : వామపక్షాలు, ప్రజాసంఘాల చలోఅసెంబ్లీ నేపథ్యంలో అమరావతిలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చిపోయే వాహనాల తనిఖీలతో ఖాకీలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వామపక్షనేతలను  ముందస్తు అరెస్ట్‌లు చేశారు. కృష్ణాజిల్లాలో 150 మంది లెఫ్ట్‌నేతలు, ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేశారు. బస్‌, రైల్వేస్టేషన్లతోపాటు వామపక్షనేతల...

Monday, November 20, 2017 - 09:45

గుంటూరు : వామపక్షాలు, ప్రజాసంఘాల చలోఅసెంబ్లీ నేపథ్యంలో అమరావతిలో భారీగా పోలీసులు మోహరించారు.  ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చిపోయే వాహనాల తనిఖీలతో ఖాకీలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వామపక్షనేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. కృష్ణాజిల్లాలో 150 మంది లెఫ్ట్‌నేతలు, ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేశారు. బస్‌, రైల్వేస్టేషన్లతోపాటు వామపక్షనేతల ఇళ్ల...

Monday, November 20, 2017 - 08:50

గుంటూరు : నాలుగు రోజుల విరామం అనంతరం ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. ఉపాధి హామీ, వ్యవసాయం రంగాలపై శాసన సభలో చర్చించనున్నారు. సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖలపై శాసనమండలిలో చర్చించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Pages

Don't Miss