తూర్పు-గోదావరి
Sunday, May 21, 2017 - 18:30

కాకినాడ: భూసేకరణ చట్టంలో సవరణలకు వ్యతిరేకంగా కాకినాడ సెజ్ పరిధిలోని... రమణక్కపేటలో సదస్సు జరిగింది. సీపీఎం, రైతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో... ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని నేతలు కోరారు. ఓ వైపు నేతలు మాట్లాడుతుండగానే... పోలీసులు సదస్సును అడ్డుకున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి శేషబాబ్జి, రైతు సంఘం నేత అప్పారెడ్డిని అరెస్ట్ చేశారు.

Sunday, May 21, 2017 - 15:22

తూర్పుగోదావరి :కాకినాడ కబ్జా కోరల్లో చిక్కుకుంది. నగరంలోని విలువైన ఖాళీ స్థలాలన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. సాక్షాత్తు ప్రజాప్రతినిధులే స్థలాలపై కన్నేసి కాజేసే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ భూములకు... స్థానికుల స్థలాలను రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నారు.

కాకినాడలో కబ్జాలకు సుదీర్ఘ చరిత్ర

...

Sunday, May 21, 2017 - 11:53

తూర్పుగోదావరి జిల్లా ;  జెడ్పీ చైర్మన్ పదవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పదవి కోసం సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ గత ఎన్నికల్లో జెడ్పీటీసీగా వైసిపి తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే ఏడాదిన్నర క్రితం తండ్రితో పాటు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆ సందర్భంలో ఇచ్చిన హామీ ప్రకారం జెడ్పీ చైర్మన్...

Saturday, May 20, 2017 - 18:34

తూ.గో : కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌లోని కన్వినర్‌ బెల్ట్‌లో పడి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. మైలపల్లి వాసు అనే కార్మికుడు పోర్ట్‌లో రోజులాగే విధుల్లోకి వచ్చాడు.. షిప్‌ నుండి ముడిసరుకును కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా బయటకు తీస్తుండగా వాసు బెల్ట్‌లో చిక్కుకున్నాడు.. మృతుడు మత్స్యకారుడిగా గతంలో పనిచేసేవాడు.. ప్రభుత్వం...

Saturday, May 20, 2017 - 16:42

ఈ.గో : తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై కేసు నమోదైంది. ఇరగవరం ఎస్సైతో పాటు రైటర్‌ను నిర్భంధించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు 8 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిపై 341, 342, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 

Monday, May 8, 2017 - 16:46

తూర్పు గోదావరి : జిల్లాలోకాకినాడ కలెక్టరేట్‌ సీపీఎం ఆధ్వర్యంలో వద్ద మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేశారు. సోమవారం గ్రీవెన్స్‌ డే సందర్భంగా పెద్దసంఖ్యలో వచ్చే ప్రజల కోసం ఈ చలివేంద్రం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయాండి.

Sunday, May 7, 2017 - 11:45

తూర్పు గోదావరి : కోటి కలలతో దుబాయ్ వెళ్లాడు.. అనుకోని ప్రమాదం అతడిని జీవచ్ఛవాన్ని చేసింది. ఎనిమిదేళ్లుగా మంచానికే పరిమితమైపోయాడు. ఇటీవలే తండ్రి మరణం.. కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లి తనలాగే మంచానికి పరిమితం కావడంతో.. జీవితంపై ఆశలు కోల్పోయాడు. తనను చంపేయమంటూ కనిపించిన ప్రతివారినీ అభ్యర్థిస్తున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి..? అతనికి వచ్చిన కష్టం ఏంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ. 
...

Saturday, May 6, 2017 - 16:59

తూర్పుగోదావరి :టెంకవరం మండలం కత్తిపూడి గ్రామంలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు చిన్నారులతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో తీవ్రవిషాదం నెలకొంది. కాగా... వీరి ఆత్మహత్యకు ఆర్ధిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.

Friday, May 5, 2017 - 14:49

తూ.గో : కాకినాడ వీబీ ఎక్స్‌పో ఆక్వా కంపెనీలో అమోనియా గ్యాస్‌ లీకేజ్‌ కలకలం రేపింది. ఈ ఘటనలో 10 మంది మహిళా కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. వీరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Friday, May 5, 2017 - 13:47

తూర్పు గోదావరి : కోనసీమ రైల్వే లైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగి 18 ఏళ్లవుతోంది. బాలయోగి స్పీకర్ గా ఉన్నప్పుడు అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ రైల్వే లైన్ కి శంకుస్థాపన అయితే చేశారు. పునాది రాయి పడింది కానీ అప్పటి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కోనసీమ ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. ఇక్కడ రైల్వే లైన్ ఏర్పాటైతే వివిధ ఉత్పత్తుల రవాణాకు రైలు మార్గం తోడ్పడుతుందని అంతా...

Pages

Don't Miss