చిత్తూరు
Tuesday, August 15, 2017 - 13:30

చిత్తూరు : రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.. తిరుపతి అంటే తనకు ప్రత్యేక అభిమానమని గుర్తు చేసుకున్నారు.. అలిపిరిలో తనపై దాడి జరిగిందని.. వేంకటేశ్వర స్వామి పునర్జన్మ ఇచ్చారని చెప్పారు.

 

 

Tuesday, August 15, 2017 - 12:36

చిత్తూరు : తిరుమలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యాత్రికుల సేవలో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే టీటీడీ అధికారులు, సిబ్బంది తిరుమలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. జేఈఓ క్యాంపు కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. తిరుమల జేఈవో శ్రీనివాసరాజు జెండా ఎగరేసి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ విజిలెన్స్‌,...

Tuesday, August 15, 2017 - 10:25

చిత్తూరు : భారత్ దేశం ఎక్కువగ అభివృద్ధి చెందె అవకాశం ఉందని, ఎందుకంటె భారత్ యువతతో నిండి ఉందని, యువత తలుచుకుంటే ఎదైనా సాధిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్వాతంత్ర్య సమయోధులకు పించన్ రూ.7 నుంచి 15 పెంచుతామని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఇంగ్లీష్ భష మాట్లాడే దేశాల్లో భారత్ ముందుంటుదని చంద్రబాబు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Monday, August 14, 2017 - 20:06

చిత్తూరు : జనగణమణ గీతానికి ఎంతో శక్తి ఉంది. ఈ పాటవినగానే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుస్తాయి. యావత్‌ భారత జాతిని కదిలించే శక్తి ఈ పాటకు ఉంది. అలాంటి జాతీయ గీత రచనకు చిత్తూరు జిల్లాలో బీజాలు పడ్డాయి.విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు చిత్తూరుజిల్లాలోని మదనపల్లితో విడదీయరాని సంబంధమే ఉంది. బీసెంట్‌ థియోసాఫికల్‌ కాలేజీకి రవీంద్రుడు తరచూ వస్తుండేవారు. 1919 ఫిబ్రవరిలో ఐదు రోజులు ఈ...

Monday, August 14, 2017 - 19:07

చిత్తూరు : తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో పారా అథ్లెట్ మధుబాగ్రికి అవమానం జరిగింది. స్పైస్ జెట్ విమాన సిబ్బంది మధు తో దురుసుగా ప్రవర్తించారు. మధు వీల్ చైర్ లో ఉన్నందుకు విమానంలో మొదటి సీటు కావాలన్నారు. కానీ సిబ్బంది మాత్రం మూడో వరుసలో కేటాయించిన సీటులో కూర్చోవాలని చెప్పినట్టు ఆమె ఒక సేల్ఫీ వీడియో ద్వారా తెలపారు. తనను అవమానించారని మధుబాగ్రి తీవ్ర ఆవేదనకు లోనైయ్యారు. అటు...

Monday, August 14, 2017 - 17:52

చిత్తూరు : టీటీడీ ఆస్తులు, భక్తులకు భద్రత కల్పించడం కత్తిమీద సాములాంటిదన్నారు నూతన ముఖ్య భద్రతాధికారి రవికృష్ణ. తిరుమల భద్రత విషయంలో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని.. వచ్చే బ్రహ్మోత్సవాలలోపు అత్యాధునిక టెక్నాలజీతో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. తిరుమలలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా నిఘాను మరింత పటిష్టం చేసినట్లు తెలిపారు. తిరుమలలో...

Sunday, August 13, 2017 - 08:08

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతం, వరుస సెలవులతో భారీగా పెరిగిన తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కంపార్టుమెంట్లు నిండి వెలుపల కిలోమీటర్ మేర క్యూలైన్ భక్తులతో కళకళడుతుంది. శ్రీవారిదర్శనానికి 14గంటల సమయం పడుతుంది. నడకదారిన భక్తులకు 3గంటల సమయం పడుతోంది. భక్తులు గదులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Pages

Don't Miss