అనంతపురం
Saturday, May 27, 2017 - 09:36

అనంతపురం : తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖలు చేశారంటూ.. ఇప్పల రవీంద్ర అనే యువకుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే టీడీపీ పై కామెంట్లు చేశారని రవీంద్ర వైజాగ్‌ సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఫిర్యాదుతో రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాడిపత్రికి తరలించారు. అయితే.. వైసీపీ...

Saturday, May 27, 2017 - 08:54

అనంతపురం: గుత్తి మండలం వన్నె దొడ్డి వద్ద జాతీయ రహదారిపై టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. 48 మంది ప్రయాణికులతో హైదరాబాద్-బెంగళూరు వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ గరుడ బస్సు ఓ లారీని ఓవర్ టేక్ చేయబోయి పది అడుగుల ఎత్తైన ఫ్లైఓవర్ నుంచి కింద పడింది.ఈ ఘటన శనివారం వేకువజామున 3.30 నుండి 4గంటల సమయంలో జరిగింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి...

Friday, May 26, 2017 - 09:22

అనంతపురం: మడకశిరలో ఆటోబోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 9 మందికి గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

Wednesday, May 24, 2017 - 21:52

అనంతపురం : రాయలసీమలో ఉరుముతున్న కరువును తరిమేయాలంటూ వామపక్షాలు కదం తొక్కాయి. కరవు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని వామపక్ష, ప్రజాసంఘాల నేతలు నినదించారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. కామ్రేడ్ల నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి. మొత్తంగా రాయలసీమ బంద్‌ పిలుపు సక్సెస్‌ అయ్యింది...

Wednesday, May 24, 2017 - 13:11

అనంతపురం : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాయలసీమ లో కరువు తాండవిస్తోందని జిల్లా సీపీఎం జిల్లా ఓబుల కొండా రెడ్డి ఆరోపించారు. బంద్ లో పాల్గొన్న ఆయన '10టివి'తో మాట్లాడుతూ...వ్యవసాయ కూలీల బకాయలను కూడా ఈ ప్రభుత్వం నిలిపేవేయడంతో వారంతా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని వారందని వెనక్కు తీసుకువచ్చే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా తాగునీటి సమస్య ఉందని వీటన్నింటిని పట్టించుకోకుండా...

Wednesday, May 24, 2017 - 12:37

అనంతపురం : రాయలసీమలో బంద్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచి నాలుగు జిల్లాల్లో వామపక్షాల నేతలు ఆందోళనలు చేపట్టారు. బస్‌ డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. షాపులను మూసివేశారు. అయితే.. బంద్‌ నిర్వహస్తున్న వామపక్షాల నేతలను అడ్డుకున్న పోలీసులు... పలువురిని అరెస్ట్‌ చేశారు. దీంతో అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనేకచోట్ల శాంతియుతంగా బంద్‌ చేస్తున్నా......

Wednesday, May 24, 2017 - 10:44

కడప :జిల్లాలో పూర్తిస్థాయిలో బంద్‌ జరుగుతోంది. వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు దిగుతున్నారు. పలు పట్టణాల్లో భారీసంఖ్యలో వాహనాలు ఎక్కడివక్కడే నిలిపోయాయి. ప్రొద్దుటూరు ఆందోళనకు దిగిన వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులన, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అటు తిరుపతిలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. బస్టాండ్‌ సర్కిల్‌వద్ద బైఠాయించిన ఆందోళనకారులు...

Wednesday, May 24, 2017 - 09:21

అనంతపురం: పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమకు నీళ్లు ఇస్తామంటున్నారాని దానికీ.. దీనికి ఏమైనా సంబంధం ఉందాని అని వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. పట్టి సీమ ఏమైనా చంద్రబాబు తాత సీమనా అని మండిపడుతున్నారు. రాయలసీమ కరువుపై నేడు సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా అనంతపురం బస్టాండ్ వద్ద ఆందోళన చేపడుతున్న కార్యకర్తలను '10టివి' పలుకరించింది. ఈ...

Wednesday, May 24, 2017 - 06:50

హైదరాబాద్: రాయలసీమ కరువు సమస్యను పరిష్కరించాలంటూ వామపక్షాల ఇవాళ రాయలసీమ బంద్‌ కు పిలుపునిచ్చాయి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రాయలసీమ బంద్‌ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

Pages

Don't Miss