ap-district-westgodavari

పశ్చిమగోదావరి

Monday, May 22, 2017 - 16:52

పశ్చిమగోదావరి : జిల్లా దెందులూరులో ప్రమాదవశాత్తూ చెరువులోపడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.. మోటపర్తివారి కోనేరు చెరువు దగ్గర ఐదేళ్ల గౌతం, నాలుగేళ్ల దింపు ఆడుకునేందుకు వెళ్లారు.. కాలుజారి చెరువులోపడిపోయి చనిపోయారు.

Monday, May 22, 2017 - 15:39

పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు గేట్ల నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. స్పిల్‌వే పనులను పర్యవేక్షించారు. పనులు ఏ మేరకు జరిగాయో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ రమేష్‌లను అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, పునరావాస ప్యాకేజీ తదితర అంశాలపై జనవనరుల శాఖ,రెవిన్యూ, కాంట్రాక్టర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 

Monday, May 22, 2017 - 15:19

పశ్చిమ గోదావరి : జిల్లా దెందులూరులోని గౌడ కాలనీలో విషాదం చొటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ మోటపర్తివారి కోనేరు చెరువులో ఇద్దరు చిన్నారులు ఐదేళ్ల మోర్ల గౌతమి, నాలుగేళ్ల కొండేటి దింపు మునిగి చనిపోయారు. గౌడ కాలనీలో ఇంటి ప్రక్కనే మంచినీటి చెరువు ఉండడంతో పిల్లలు అక్కడి ఆడుకోవాడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు రెండు గంటల తర్వాత పిల్లలు లేరని గుర్తించి...

Sunday, May 21, 2017 - 18:56

పశ్చిమగోదావరి :జిల్లాలో పోలీసులు, ప్రజాప్రతినిధులమధ్య వివాదం మరింత మదురుతోంది.. తణుకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినందుకు జిల్లాకుచెందిన 12మంది ఎమ్మెల్యే లు, ఇద్దరు ఎమ్మెల్సీ లు గుర్రుగా ఉన్నారు.. ఎమ్మెల్యేపై కేసుకు నిరసనగా గన్‌మెన్లను వెనక్కిపంపారు...

Sunday, May 21, 2017 - 15:49

పశ్చిమగోదావరి : జిల్లా ఏలూరులో జిల్లా సంస్థాగత ఎన్నికల సమావేశం రసాబాసాగా మారింది. టీడీపీ కార్యకర్తల నిరసనలతో హోరెత్తింది. ఇరగవరం ఎస్సై, రైటర్‌ను నిర్బంధించిన కేసులో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై పెట్టిన కేసును వెంటనే తొలగించి, జిల్లా ఎస్పీని సస్పెండ్‌ చేయాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం...

Saturday, May 20, 2017 - 18:42

పశ్చిమగోదావరి: జిల్లా చింతలపూడి సరిహద్దుల్లో దారుణం చోటు చేసుకుంది. టి.నరసాపురం మండలం గండిగూడెంకు చెందిన మంగమ్మ, మహాలక్ష్మి అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చింతలపూడి మండలం తీగలవంచ గ్రామ సరిహద్దుల్లో జీడి మామిడి గింజలు ఏరడానికి వెళ్లిన వారిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు హత్యల వెనుక ఉన్న కారణాలను...

Saturday, May 20, 2017 - 15:32

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడి దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో రెండు రోజుల్లో ఐదుగురు వడదెబ్బతో మృతిచెందారు. యార్లగడ్డ ఏసురత్నం, కామేశ్వరరావుతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతోనే జనం మృత్యువాత...

Saturday, May 13, 2017 - 18:39

పశ్చిమ గోదావరి : భీమవరం వైసీపీ నియోజకవర్గ కన్వీనర్‌ గ్రంధి శ్రీనివాస్‌ కుమారుడు సాగర్‌ దంపతులను వైసీపీ అధినేత జగన్‌ ఆశీర్వదించారు. ఈనెల తొమ్మిదో తేదీన సాగర్‌, సుధల వివాహం జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ పెళ్లికి జగన్‌ హాజరుకాలేకపోయారు. ఈరోజు వారి ఇంటికి వెళ్లి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

 

Tuesday, May 9, 2017 - 21:16

పశ్చిమగోదావరి : కేంద్ర విమానయాన మంత్రి అశోక గజపతిరాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మీద వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ ఎవరో తనకు తెలియదని తెలిపారు. పవన్ కల్యాణ్ సినిమా నటుడని తనకు తెలిసిందని.. తాను సినిమాలు చూసి చాలా సంవత్సరాలైందన్నారు. దీంతో అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై పవర్‌స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Tuesday, May 9, 2017 - 19:06

పశ్చిమగోదావరి : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో పర్యటించారు. విర్డ్‌ ఆస్పత్రిలో 27 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్థోపెడిక్‌ వైద్య పరికరాలను అశోక్‌గజపతి రాజు ప్రారంభించారు. భారత విమానాశ్రయాల సంస్థ సీఎస్ ఆర్ గ్రాంటుతో వీటీని కొనుగోలు చేశారు. అనంతరం ద్వారకాతిరుల వెంకటేశ్వరస్వామిని అశోక్‌గజపతి రాజు...

Pages

Don't Miss