ఏపీసెట్-2019 ఉమ్మడి పరీక్ష షెడ్యూల్ విడుదల

Submitted on 12 January 2019
APCET-2019 (3755), AP Eamcet (3756), APPG CET (3757), APCET exam Schedule (3758)

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శనివారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏపీ సెట్) పరీక్ష తేదీలను విడుదల చేసినట్టు గంటా తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆన్‌లైన్‌లో 7 ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రవేశ పరీక్షల తేదీలను వెల్లడించారు. ఏపీసెట్ సహా ఏపీఎంసెట్ (ఇంజినీర్, అగ్రికల్చర్), ఏపీఐసెట్, ఏపీ పీజీ ఈసెట్, ఏపీ ఈడీసెట్, ఏపీ లాసెట్, ఏపీ పీఈ సెట్ పరీక్ష తేదీలతో కూడిన షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. 

ఏప్రిల్ 19, 2019న జేఎన్టీయూ (అనంతపురం) ఏపీ సెట్ 2019 పరీక్షను నిర్వహించనుంది. అలాగే ఏపీ ఎంసెట్ పరీక్షను ఏప్రిల్ 20, 22 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి, ఏప్రిల్ 24వ తేదీన అగ్రికల్చరల్ విభాగానికి పరీక్ష నిర్వహించనున్నారు. ఏపీఎంసెట్ 2019 పరీక్షను జేఎన్టీయూ (కాకినాడ) నిర్వహించనుంది. అదేవిధంగా ఏపీ ఐసెట్ 2019 పరీక్షను ఎస్వీయూ (తిరుపతి), ఏప్రిల్ 26వ తేదీన నిర్వహించనుంది. ఏపీ పీజీ ఈసెట్ 2019 పరీక్షను ఆంధ్రా యూనివర్శిటీ (విశాఖపట్నం) మే 1 నుంచి మే 4 వరకు నిర్వహించనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. 
APCET-2019, AP Eamcet, APPG CET, APCET exam Schedule

APCET-2019
AP Eamcet
APPG CET
APCET exam Schedule

మరిన్ని వార్తలు