అచ్చెన్నాయుడు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు: విజిలెన్స్ అధికారుల చేతిలో సిఫార్సులేఖ

Submitted on 22 February 2020
AP Vigilance Sp Venkata reddy confirm Acchennaidu recommendation letter on ESI Scam

తెలంగాణలో  ESI-IMS స్కామ్‌ మరకముందే ఏపీలోనూ ESI-IMS స్కామ్ ప్రకంపనలు రేపుతోంది.  గత ఆరు సంవత్సరాల్లో 100 కోట్ల వరకు అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్‌లో మాజీమంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉందంటూ ఆరోపించిన అధికారపార్టీ.... ఆయనపై చర్యలు తప్పవని  హెచ్చరించింది. మరోవైపు ఈ స్కామ్‌తో తనకేమీ సంబంధం లేదని.. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు.

విజిలెన్స్‌ అధికారులు  బయటపెట్టిన ఈ  కుంభకోణం ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంది.  స్కామ్‌తో టీడీపీ నేతలకు సంబంధముందని  వైసీపీ ఆరోపిస్తోంది. స్కామ్‌కు తమకు సంబంధమే లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. పరిస్థితి టీడీపీ వర్సెస్‌ వైసీపీలా మారింది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. 

కాగా...నిబంధనలు పాటించకుండా గత 5 ఏళ్ళలో 975 కోట్ల రూపాయలు మేర   డ్రగ్స్, సర్జికల్ ఐటెమ్స్, ఫర్నిచర్  కోనుగోళ్లలో  కుంభకోణం జరిగిందన్నారు విజిలెన్స్ ఎస్పీ వెంకట రెడ్డి . అసలు ధర కంటే వెచ్చించి మందులు కొనుగోలు చేశారని చెప్పారు. గత 5 సంవత్సరాల కాలంలో ముగ్గుర ఈఎస్ ఐ  డైరెక్లర్లు పని చేశారని చెప్పారు.   

ఈఎస్ ఐ కి పని చేసిన డైరెక్టర్లు కాంట్రాక్డులో లేని  నాన్ రేట్ కాంట్రాక్టర్ల  సంస్ధల వద్ద నుంచి  అత్యధిక మందులు కొనుగోలు చేసినట్లు గుర్తించామని వెంకట రెడ్డి చెప్పారు. వీటికి డెరెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ..కార్మిక శాఖమంత్రిగా అచ్చెనాయుడు రాసిన లేఖను కూడా కనుగొన్నామని..క్లియర్ గా ఫలానా సంస్ధకు కాంట్రాక్టు ఇవ్వమని మంత్రి సిఫార్సు చేశారని వెంకట రెడ్డి వివరించారు.  టెండర్లు పిలవకుండా అధికారులు ఆ సంస్ధతోనే కాంట్రాక్టు కుదుర్చుకున్నారని  విజిలెన్స్ ఎస్పీ వివరించారు. 

Read More>>విశాఖ నేవీ దెబ్బకు జగన్ సర్కార్ సైలెంట్ అయిపోయింది

andhra pradesh
Achennayudu
TDP
YCP
esi scam
vigilance
enquiry

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు