27, 28 తేదీల్లో సమస్యలపై ఏపీ-తెలంగాణ భేటీ

Submitted on 18 June 2019
AP, Telangana State Level Meeting On Bifurcation Issues

జూన్ 27, 28 తేదీల్లో విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. షెడ్యూల్ 9, 10 కింద ఉన్న పెండింగ్ సమస్యలకు ఓ పరిష్కారం ఈ భేటీల్లో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఆస్తులు - అప్పుల విషయం కూడా చర్చించనున్నట్లు వెల్లడించారు.  ఏపీతో స్నేహపూర్వక వాతావరణం కొనసాగించనున్నట్లు వివరించారాయన.

విపత్తులు, పోలీస్, శాంతిభద్రతల అంశంతోపాటు ఇతర వ్యవహారాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఏపీ రాష్ట్రంతో  వెళుతున్నట్లు తెలిపారు కేసీఆర్. కేబినెట్ లో విస్త్రుతమైన చర్చ తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు కేసీఆర్. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత.. సెక్రటేరియట్ భవనాలు తిరిగి ఇవ్వటం జరిగిందన్నారు. ఈ భవనాల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయ్యిందన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు సీఎం కేసీఆర్. గత ప్రభుత్వ హయంలో ఘర్షణపూర్వకంగా వెళ్లారని.. కొత్త ప్రభుత్వంతో అలాంటి ఇబ్బందులు లేవన్నారు.

AP
Telangana
CM KCR
cm jagan
Bifurcation Issues


మరిన్ని వార్తలు