నాకున్న విశేషాధికారాలతోనే బిల్లులను సెలక్ట్‌ కమిటికి సిఫార్స్‌ చేశా : మండలి ఛైర్మన్‌ 

Submitted on 24 January 2020
AP Legislative Council chairman Sharif responds on decentralization and CRDA cancellation bills recommend to selection committee

తనకు ఉన్న విశేష అధికారాలతోనే వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి సిఫార్స్ చేశానని ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ అన్నారు. గురువారం (జనవరి 23, 2020) పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన మాట్లాడుతూ వైసీపీ సభ్యులు ఆవేశపూరితంగా మాట్లాడారు తప్ప ఉద్దేశపూర్వకంగా కాదన్నారు. మూడు రాజధానులపై తానేమీ మాట్లాడనని తెలిపారు. 

అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను.. సెలక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మరో మూడు నెలలు రాజధానుల అంశం పెండింగ్‌లో పడినట్లే. ఈ అంశంపై రోజంతా శాసన మండలిలో ప్రతిష్టంభన ఏర్పడగా.. బిల్లులపై ఓటింగ్ జరపాలని.. అధికారపక్షం.. సెలక్ట్ కమిటీకి పంపాల్సిందేనంటూ ప్రతిపక్షం మండలి చైర్మన్ ముందు తమ వాదనలు వినిపించాయి. 

ముందుగా మండలి చైర్మన్ రెండు బిల్లులపై చర్చ నిర్వహించారు. అందరూ ప్రసంగించిన తర్వాత.. అసలు విషయం తెరపైకి వచ్చింది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని ముందుగానే తెలుగుదేశం పక్ష నేత యనమల రామకృష్ణుడు నోటీసులు ఇచ్చారు. అయితే.. అవి సాంకేతికంగా మూవ్ కాలేదని.. చైర్మన్ చెప్పారు.

శాసన మండలి ఛైర్మన్ నిర్ణయంపై టీడీపీ సభ్యులు హర్షం వ్యక్తం చెయ్యగా.. వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం సభ్యులు జై అమరావతి నినాదాలు చేస్తుండగా.. వైసీపీ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మండలి ఛైర్మన్ ప్రవర్తించిన తీరు దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. 

అధికారపక్షం పంపిన బిల్లును మండలిలో తిప్పి పంపారనే విషయాన్ని గుర్తు చేశారు. సంఖ్యా బలం ఉందని మండలిలో టీడీపీ అడ్డగోలుగా వ్యవహరించిందని, నిబంధనల ప్రకారం నడవాలని బీజేపీ, పీడీఎఫ్ ఇతర ఎమ్మెల్సీలు చెప్పారని వివరించారు. అయితే..ఇక్కడ మాత్రం ఛైర్మన్ మాత్రం టీడీపీ అధ్యక్షుడు బాబు చెప్పినట్లు చేశారని తెలిపారు.

శాసన మండలికి ఛైర్మన్ తీరని మచ్చ తెచ్చారని, ఏ ప్రజాస్వామ్య వాదిని అడిగినా..ఇదే విషయాన్ని చెబుతారని తెలిపారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచారని, ఛైర్మన్ ఎంతో మంచి వ్యక్తి అనుకుంటే..ఆయన పవర్తించిన తీరు దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం కోరినట్లు ఛైర్మన్ వ్యవహరించిన సూచించాలన్నారు. 
 

AP
Legislative Council
chairman Sharif
respond
DECENTRALIZATION BILL
CRDA cancellation bill
recommend
Selection Committee
West Godavari District Tanuku

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు