’అన్నదాత సుఖీభవ’ : రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. జీవో జారీ

Submitted on 17 February 2019
ap govt ready to implement Annadata Sukhibhava Scheme

అమరావతి : అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధం అయింది. అన్నదాత సుఖీభవ పథకంలో పెంచిన మొత్తాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందుబాటులో ఉన్న మంత్రుల నుంచి సంతకాలు తీసుకుని జీవో జారీ చేసింది. తొలి విడతగా రూ.4 వేలు ఇస్తామని సర్కార్ చెప్పింది. అందులో కొంత మొత్తాన్ని మొదటి విడతగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. రేపటిలోగా రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ తో ఇబ్బంది లేకుండా ఉండేందుకు వెంటనే రైతు ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. 
 

ap govt
ready
implement
Annadata Sukhibhava Scheme
amaravati
guntur

మరిన్ని వార్తలు