జగన్ ఎఫెక్ట్: బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి జీవో జారీ

Submitted on 19 February 2019
AP Govt Issues GO For BC Community Halls Construction

అమరావతి: ఎన్నికల ముందు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో బీసీ కమ్యూనిటీ హాళ్లు, భవనాల నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 13 జిల్లాల్లో 158 మండలాల్లో బీసీ కమ్యూనిటీ భవనాలు, హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.10లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎన్నికల వేళ ఇంత సడెన్‌గా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాజకీయ లబ్ది కోసమే అని విపక్షాలు అంటున్నాయి. బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారని విపక్ష నాయకులు చెబుతున్నారు.

 

ఇది వైసీపీ జగన్ ఎఫెక్ట్ అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఏలూరు బీసీ గర్జనలో.. బీసీలపై జగన్ వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వస్తే శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని, బీసీల అభివృద్ధి కోసం ఏటా రూ.15వేల కోట్లు కేటాయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. బీసీల ఆర్థిక ఎదుగులకు సాయం అందిస్తామని చెప్పారు. బీసీలకు జగన్ ఇచ్చిన హామీలు సీఎం చంద్రబాబులో కలవరం పెంచాయని, ఎక్కడ బీసీ ఓటర్లు దూరం అవుతారోననే భయంతో చంద్రబాబు హడావుడిగా బీసీ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని వైసీపీ నాయకులు అంటున్నారు.

ap govt
ap govt go
bc community halls construction
cm chandrababu
TDP
Ys Jagan Mohan Reddy
YSR congress party
eluru bc garjana
ap elections

మరిన్ని వార్తలు