ఇంట్లోవాళ్లే ఫోరెన్సిక్ సాక్ష్యాలు నాశనం చేశారు..వివేకా హత్యపై సీఎం హాట్ కామెంట్స్

Submitted on 15 March 2019
AP CM CHANDRAbabunaidu YS VIVEKA DEATH MYSTERY

వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉదయం వివేకా మరణ వార్త విన్నప్పుడు భాధ కలిగిందని అన్నారు.అప్పటి వరకు ఉన్న వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని మొదట అన్ని ఛానల్స్ లో వచ్చిందని,దానిపై తాను కూడా తీవ్ర సంతాపాన్ని తెలియజేశానన్నారు.  వివేక మరణంపై వైసీపీ రాజకీయాలు చేస్తుందన్నారు. ఉదయం తనకు వచ్చిన సమాచారం ప్రకారం... వివేకా ఇంటికి 5:30గంటల సమయంలో ఆయన పీఏ వెళ్లడం,బయట కూర్చోవడం,తలుపు తడితే లోపల నుంచి వివేకా తలుపు తీయకపోవడం, ఆ తర్వాత పనిమనిషి కూడా రావడం, ఇద్దరూ కలిసి వివేకా భార్యకు ఫోన్ చేశారని, ఇంటికి లేటుగా వచ్చి ఉంటారని,లేపవద్దని ఆమె వారికి సూచించిందని,ఆ తర్వాత వాళ్లు వెనుక ఉన్న డోర్ దగ్గరకు వెళ్లి చూస్తే ఆ డోర్ తెరిచి ఉందని,అందులో నుంచి లోపలికి వెళ్లారని,లోపలికి వెళ్లిన తర్వాత బాత్రూమ్ లో వివేకా పడిపోయి ఉన్నారని,దీంతో ఆయన చెయ్యి పట్టుకుని వారు చూసి చనిపోయారని నిర్థారించుకున్న తర్వాత బయటికి వచ్చి ఈ సమాచారం తెలియజేశారని, 6:40గంటలకు అవినాష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేసి..వివేకా చనిపోయాడని చెప్పారని, హత్య జరిగిందని ఎవ్వరూ అప్పటికి చెప్పలేదని అన్నారు.

సీఐ 7:30గంటలకు పోలీస్ ఫోర్స్ తో స్పాట్ కి వెళ్లారని తెలిపారు.సాధారణంగా ఏదైనా హత్య జరిగినప్పుడు డెడ్ బాడీని కానీ,ఆ ప్లేస్ లను కానీ డిస్ట్రబ్ చేయరని,డెడ్ బాడీ బాత్రూమ్ లో ఉందని మొదట చెప్పినవాళ్లు ఆ డెడ్ బాడీని బాత్రూమ్ నుంచి బెడ్ రూమ్ లోకి తీసుకువచ్చారని,బెడ్ రూమ్ లో ఆయన తలకు గాయం అయిందని తలకు ఓ గుడ్డ కట్టారని,సీఐ అక్కడికి వెళ్లేలోపే అక్కడున్న బ్లడ్ అంతా క్లీన్ చేశారని,బ్లడ్ క్లీన్ చేసిన తర్వాత డెడ్ బాడీని హాస్పిటల్ కు తరలించడం,హాస్పిటల్ కు వెళ్లినప్పుడు కూడా వివేకా గుండెపోటుతో చనిపోయారని నమ్మించారని అన్నారు. హాస్పిటల్ తీసుకుపోయేవరకు ఇదంతా ఎందుకు దాచిపెట్టారని అన్నారు. ఆ ఇంట్లో ఉండే వాళ్లు ఎందుకు ఈ విషయం దాచిపెట్టి గుండెపోటుగా చిత్రీకరించారని అన్నారు.తలపై అంతపెద్ద గాయాలు ఉన్న తర్వాత ఎవరైనా ఇది ఖచ్చితంగా హత్యే అని చెప్పగల్గుతారని,అలాంటప్పుడు డెడ్ బాడీని ఎలా క్లీన్ చేస్తారని, బాత్ రూమ్ లో నుంచి బెడ్ రూమ్ లోకి ఎలా తీసుకొచ్చారని,బెడ్ రూమ్ నుంచి హాస్పిటల్ కు ఎలా తీసుకెళ్లారని,అదేవిధంగా బెడ్ రూమ్ ని ఎందుకు క్లీన్ చేశారని అన్నారు.ఇవన్నీ అనుమానాలు తావు ఇస్తున్నట్లు తెలిపారు.

హాస్పిటల్ లో పోస్ట్ మార్టం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయిందని,రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టారని,తనపై,లోకేష్ పై,టీడీపీపై ఆరోపణలు చేశారని అన్నారు. తమపై రాజకీయ పబ్బం కోసమే ఆరోపణలు చేశారని చంద్రబాబు అన్నారు. అన్నీ దాచిపెడుతూ..సాక్ష్యాలన్నీ మాయం చేశారన్నారు. పోలీసులను కూడా గుండెపోటుతో చనిపోయారని నమ్మించారని, పడినప్పుడు ఈ దెబ్బలు తగిలాయి తప్ప మరొకటి కాదని నమ్మించారన్నారు. కేసులు కూడా అవసరం లేదని వాళ్లే నిర్థారించారని, 9-10గంటలవరకు అలాగే చెప్పారని,ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి పోస్ట్ మార్టం సర్టిఫికెట్ వచ్చిందో అప్పటి నుంచి ఆరోపణలు మార్చారని,సాయంత్రానికి స్వరం మార్చారని అన్నారు.తప్పు కప్పిపుచ్చుకోవడానికి చేసే ఈ పనులు చాలా దుర్మార్గమని తెలిపారు. వివేకా చనిపోయిన తర్వాతఆ ఇంటి దగ్గరకు అవినాష్ రెడ్డితో సహా పలువురు ముఖ్యులు అక్కడకు వెళ్లినా కూడా ఇది హత్య అని ఎందుకు చెప్పలేకపోయారని..దీనికి సమాధానం చెప్పాలన్నారు. వాళ్ల మధ్యలోనే ఏదో జరిగిందన్నారు. అదంతా విచారణలో తేలుతుందన్నారు.

చివరికి డ్రైవర్ చంపాడు..ఆయనను తొందరగా రమ్మన్నాను అని ఓ లెటర్ ఇచ్చారని ఎస్పీ చెప్పారని,ఇదంతా అనుమానాస్పదంగా ఉందన్నారు. హాస్పిటల్ లో కూడా చివరికి సహజమరణం అని నమ్మించే ప్రయత్నం జరిగిందన్నారు. అసలు రాత్రి ఏమేం జరిగింది.ఎవరికి సంబంధం ఉంది..ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరముందన్నారు. ఉదయం లేని లెటర్ సాయాంత్రానికి ఎలా వచ్చిందన్నారు. జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం తెలిపారు. ఈ ఘటనలో దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు.ఇంట్లో వాళ్లే ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ను నాశనం చేశారని అన్నారు.గుండెపోటు వస్తే తల నుంచి రక్తం ఎలా వస్తుందన్నారు. తప్పులు అన్నీ వాళ్లే చేసి వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి ఇప్పుడు సీబీఐ విచారణ కోరుతున్నారని అన్నారు.నేరాలు చేయడంలో దిట్టలు ఎవరైతే ఉన్నారో దానికి ఇదే పరాకాష్ఠ అన్నారు. సాక్ష్యాత్తూ కుటుంబసభ్యుడు చనిపోయినాకూడా సాక్ష్యాలు నాశనం చేయాలనుకోవడం చాలా దుర్మార్గమని,ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం మన దౌర్భాగ్యమని అన్నారు.

ys vivekananda reddy
death
murder
Chandrababu Naidu
ACCUSE
house
Avinash Reddy
Police
PRIME OF EFFENCE
MISS
Ysrcp

మరిన్ని వార్తలు