చంద్రబాబు స్లోగన్ : టీడీపీకి ఓటు వేస్తే గెలుపు ప్రజలదే..

Submitted on 22 March 2019
AP CM Chandrababu New Slogan, Vote For TDP

విశాఖపట్నం: ఎవరికి ఓటు వేస్తే నువ్వు గెలుస్తావో వారికే ఓటు వెయ్యాలని ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఓటు వేస్తే అభ్యర్థి గెలవడం కాదు.. ప్రజలు గెలవాలి అని చంద్రబాబు అన్నారు. టీడీపీకి ఓటు వేస్తే గెలుపు ప్రజలది అని చెప్పారు. రాజకీయం.. ప్రజల కోసం చెయ్యాలని హితవు పలికారు. నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఒక అరాచక శక్తి అని, మన రాష్ట్రానికి ఒక పెద్ద సమస్య అని అన్నారు. ఐదేళ్లు తండ్రిని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్ అని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మీ మరణశాసనం మీరే రాసుకున్నట్టు అని చంద్రబాబు హెచ్చరించారు.
Read Also : జై చంద్రబాబు అంటున్న రామ్ గోపాల్ వర్మ

జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పటికైనా నోరు విప్పాలని.. జగన్ కేసుల గురించి, అవినీతి గురించి ప్రజలకు చెప్పాలని చంద్రబాబు అన్నారు. జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకా హత్యకు గురైతే.. గుండెపోటుతో చనిపోయారని డ్రామా ఆడారని, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. హత్యను గుండెపోటుగా చెప్పారంటే ఎంత దారుణమో ఆలోచించాలన్నారు. నన్ను దెబ్బకొట్టేందుకు.. జగన్ కు కేసీఆర్, మోడీ అండగా నిలుస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

AP CM chandrababu
Ys Jagan
YSR congress party
TDP
Narsipatnam
election campaign
Visakha
VOTE

మరిన్ని వార్తలు