ఆ ముగ్గురివి మాయమాటలు : సీఎం చంద్రబాబు

Submitted on 17 January 2019
ap cm Chandrababu fire on Modi, KCR, Jagan

విజయవాడ : ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. మోడీ, కేసీఆర్‌, జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. మోడీ చేతిలో రిమోట్‌ కంట్రోల్‌ ఉందని.. దానితో కేసీఆర్‌ను ఆడిస్తే.. ఇప్పుడు కేసీఆర్‌ జగన్‌ను ఆడిస్తున్నారని అన్నారు. ఈ ముగ్గురూ రాష్ట్రంపై గద్దల్లా వాలుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వీరు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. జగన్‌ మెడమీద సీబీఐ కత్తి ఉందని..అందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరుతున్నారన్నారు. బీజేపీకి సహకరించేందుకే కేసీఆర్‌, జగన్‌ కొత్త నాటకం ఆడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దేశంలో రెండే రెండు ఫ్రంట్‌లు ఉన్నాయని.. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎక్కడ ఉంది? ప్రశ్నించారు.

ముగ్గురు మోడీలు కలిసి రావాలనే కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. మొన్నటి వరకు ప్రత్యేక హోదాకు అడ్డుపడిన వారు...విభజన హామీలకు అడ్డు పడిన వారు నానా బూతులు తిట్టారని విమర్శించారు. తానెప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదన్న ఆయన...9 సంవత్సరాలు సీఎంగా పని చేసే అవకాశం తెలుగుజాతి ఇచ్చిందన్నారు.
 

AP
cm chandrababu
fire
Modi
KCR
Jagan

మరిన్ని వార్తలు