ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు : ఏపీఈడీబీ స్థానంలో ఏపీఐపీఎంఏ

Submitted on 19 July 2019
AP Cabinet approved key decisions

ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. జ్యుడిషియల్ కమిషన్ ముసాయిదా బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం లభించింది. ఏపీఈడీబీ 2018 చట్టాన్ని తొలగించింది. ఏపీఈడీబీ స్థానంలో ఏపీఐపీఎంఏ-2019 ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ యాక్ట్ కు చైర్మన్ గా సీఎం, ఏడుగురు డైరెక్టర్లతో బోర్డు ఏర్పాటు చేశారు. డైరెక్టర్లుగా ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులు, చీఫ్ సెక్రటరీ వ్యవహరిస్తారు.

శుక్రవారం జులై 19వ తేదీ అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఏపీఐపీఎంఏలో శాశ్వత ప్రత్యేక సలహా మండలికి నిర్ణయం తీసుకున్నారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శక విధానానికి కేబినెట్ శ్రీకారం చుట్టింది. అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించారు. 

పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పించేలా చట్ట సవరణకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం కల్పించారు. ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్టులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. రజకులు, నాయిబ్రాహ్మణులు, టైలర్లకు ఆర్థికసాయంగా ఏడాదికి రూ.10 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు కొత్త పథకం తీసుకొచ్చింది. వైఎస్ఆర్ నవోదయం కింద కొత్త పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడేళ్లుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలను ఆదుకునే పథకం. జిల్లాల వారీగా 86 వేల ఎంఎస్ ఎంఈల ఖాతాలు గుర్తించారు. రూ.4 వేల కోట్ల రుణాలు వన్ టైమ్ రీస్ట్రక్చర్ ఎన్పీఏలుగా మారకుండా అవకాశం ఉంది. ఎంఎస్ ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి ఈ పథకం ద్వారా అవకాశం ఉంది. ఈమేరకు శుక్రవారం జులై 19వ తేదీ అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం అయింది. 

200 యూనిట్ల వరకూ ఎస్సీలకు ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేయనున్నారు. రాష్ట్రంలో స్కూళ్లు, ఉన్నత విద్యా సంస్థల పర్యవేక్షణ, నియంత్రణలపై ముసాయిదా బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టం ద్వారా పర్యవేక్షణ, నియంత్రణకు త్వరలో కమిషన్ల ఏర్పాటు, విద్యాసంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు, ఫీజుల నియంత్రణపై దృష్టి, విద్యాహక్కు చట్టం అమలుపైనా కేబినెట్ దృష్టి సారించింది. 
 

ap cabinet
approved
key decisions
cm jagan
Amaravathi

మరిన్ని వార్తలు