తెలంగాణలో ఆంధ్ర అస్తులపై.. ఏపీ అసెంబ్లీలో రగడ

Submitted on 18 July 2019
AP Assets in Telangana State

తెలంగాణతో సఖ్యత ఉంటే పర్వాలేదు.. ఏపీ ప్రజలు అన్యాయం కాకుండా చూడాలంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీ అసెంబ్లీలో హీట్ పెట్టించాయి. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ఏపీ ఆస్తులన్నీ తెలంగాణాకి రాసిస్తున్నారని.. తెలంగాణ నుంచి ఏం వచ్చిందో కూడా చెప్పాలంటూ ప్రశ్నించటంతో వివాదం మొదలైంది. అవకాశం వచ్చిందని.. గాబరా గాబరా చేయకుండా.. అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలంటూ చెప్పుకొచ్చారు. నీటి వాటా విషయంలో అన్యాయం జరక్కుండా చూడాలంటూ అచ్చెన్న మాటలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు భగ్గమన్నారు.

ఓటుకి నోటు కేసులో అడ్డంగా ఇరుక్కుని.. ఆంధ్ర ఆస్తులన్నీ ఎక్కడికక్కడే వదిలేసి అర్థరాత్రి సర్దుకుని వచ్చారన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన. నాలుగేళ్లుగా ఆ బిల్డింగ్స్ అన్నీ మట్టి కొట్టుకుపోయాయన్నారు. నీటి, కరెంట్ బిల్లులు కోట్లలో పెండింగ్ లో ఉన్నాయన్నారు. అవసరం లేని వాటిని అప్పగించాం అని.. ఆంధ్ర ఆస్తులకు వచ్చిన ఇబ్బందులు లేవన్నారు. హైదరాబాద్ పై పదేళ్ల హక్కు ఉన్నా వదిలేసి వచ్చింది ఎవరు అంటూ ప్రశ్నించారు బుగ్గన.

ఇక నీటి విషయంలో తెలంగాణతోపాటు ఒరిస్సా, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలతో సత్సబంధాలు కొనసాగిస్తాం అన్నారు. తెలంగాణతో బాగున్నామనే ఈర్ష్య టీడీపీలో కనిపిస్తుందన్నారు. తుంగభద్ర ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని ప్రశ్నించారాయన. నీటి సోర్స్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి తీసుకువస్తాం అన్నారు.

AP
Telangana
cm jagan
AP Assembly
AP Assets

మరిన్ని వార్తలు