15 రోజుల్లో పోలవరం అవినీతి సంగతి తేలుస్తా : జగన్ వార్నింగ్ కు నవ్వుకున్న చంద్రబాబు

Submitted on 19 July 2019
AP Assembly Budget Sessions 2019 | YSRCP Vs TDP | Polavaram Project

పోలవరం ప్రాజెక్ట్ విషయమై అసెంబ్లీలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో హాట్ హాట్‌గా చర్చ సాగింది. టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంధించిన ప్రశ్నల పట్ల మంత్రి అనిల్ కుమార్ వివరణ ఇవ్వగా అనంతరం.. ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై జలవనరుల మంత్రి చర్చిస్తూనే ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు అంతా అవినీతిమయం అయ్యిందని ఆరోపించారు. 

పోలవరం మొత్తం స్కామ్‌ల మయం చేశారని..నామినేషన్ పద్ధతిలో..సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో నచ్చిన వారికి వర్క్ అప్పచెప్పారని..యనమల వియ్యంకుడు కూడా సబ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడని జగన్ అసెంబ్లీలో వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ వేశామని, స్టడీ జరుగుతోందని అన్నారు. స్పిల్ వే పనులు పూర్తి చేయకుండా కాపర్ డ్యామ్‌పై పనులు చేపట్టారని, దీనివల్ల నష్టం జరిగిందని అన్నారు. నాలుగు నెలలుగా పనులు ఆగిపోయినట్లు చెప్పారు.

నవంబర్ వరకు పనులు మొదలుపెట్టి జూన్ 2021 నాటికి పోలవరం నుంచి నీళ్లు ఇస్తామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో రివర్స్ టెండరింగ్ పిలవడం జరుగుతోందని, గత ప్రభుత్వం పిలిచిన రేటు ఎంతుందో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. టైమ్ ఇస్తామని..ఆ రేటుకు కోడ్ చేసిన తర్వాత..బిడ్డింగ్ ప్రాసెసింగ్ ద్వారా టెండర్లు అప్పచెబుతామన్నారు. ఎవరు ఎంత తక్కువ కోట్ చేసి ఉంటే వారికి అప్పచెప్పనున్నట్లు..మొత్తం ఆన్ లైన్‌లో జరుగుతుందన్నారు. 

దీనివల్ల 15 నుంచి 20 శాతం డబ్బులు మిగిలే పరిస్థితి ఉందని అధికారులు వెల్లడించారని..రూ. 1500 కోట్లు మిగిలే అవకాశం ఉందని వెల్లడించారు సీఎం జగన్. రూ. 7 వందల 24 కోట్లు అడ్వాన్స్ కింద గత ప్రభుత్వం ఇచ్చినా..పనులు ఇంత వరకు మొదలు కాలేదన్నారు. 15నుంచి 20 రోజుల్లో పోలవరం దోపిడి మొత్తం బయటకు వస్తుందని సభలో వెల్లడించారు సీఎం జగన్. కాగా పోలవరంలో అవినీతి జరిగిందని, 15రోజుల్లో బయటకు తెస్తానని జగన్ చెప్పిన మాటలపై అసెంబ్లీలో చంద్రబాబు నవ్వుకున్నారు. 

AP Assembly Budget
Sessions 2019
ysrcp vs tdp
polavaram project

మరిన్ని వార్తలు