చెక్ ఇట్ : ఏపీ టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే

Submitted on 12 February 2019
AP 10th Class Time Table 2019

ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదలైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో సోమవారం (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 2 వరకు పరీక్షలు కొనసాగుతాయని మంత్రి తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలు పూర్తయిన నెలరోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తామని మంత్రి గంటా స్పష్టం చేశారు. 

పరీక్షల సమయం:
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

పరీక్షల షెడ్యూలు:
        సబ్జెక్టు                         పరీక్ష తేదీ
తెలుగు (పేపర్-1)          -       మార్చి 16 
తెలుగు (పేపర్-2)          -      మార్చి 18
హిందీ                         -      మార్చి 19 
ఇంగ్లిష్ (పేపర్-1)            -      మార్చి 20 
ఇంగ్లిష్ (పేపర్-2)            -      మార్చి 22 
మ్యాథమెటిక్స్ (పేపర్-1)    -      మార్చి 23 
మ్యాథమెటిక్స్ (పేపర్-2)    -      మార్చి 25 
జనరల్ సైన్స్ (పేపర్ -1)     -      మార్చి 26 
జనరల్ సైన్స్ (పేపర్-2)      -      మార్చి 27 
సోషల్ స్డడీస్ (పేపర్-1)       -      మార్చి 28 
సోషల్ స్డడీస్ (పేపర్-2)       -      మార్చి 29 

విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభం అయ్యాక మరో 5 నిమిషాల వరకే గ్రేస్ పీరియడ్ ఉంటుందని, ఆ లోపు మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపారు.  

10th Class
Andhra Pradesh
Exams Schedule
2019

మరిన్ని వార్తలు