అమెరికాలో సైలెన్స్‌‌గా అనుష్కా, మాధవన్‌లు..

Submitted on 12 February 2019
anushka shetty and madhavan in silence

భాగమతి సినిమా తర్వాత గ్యా.. ప్ తీసుకుని ప్రేక్షకులను వెయిటింగ్‌తో పిచ్చెక్కిస్తుంది అనుష్క. అయితే ఈ గ్యాప్ తన కొత్త గెటప్ కోసమేనని చెప్పకనే చెప్తున్నాయి ఇటీవల విడుదలైన ఫొటోలు. బరువు తగ్గడం కోసం ఆయుర్వేద వైద్యం తీసుకుంది అనుష్క. ప్రస్తుతం అనుష్క.. హీరో మాదవన్‌తో అమెరికాలో బిజీగా ఉంది. 

 

హాలీవుడ్ స్టార్ నటుడు మైకేల్ మాడ్‌సన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సైలెన్స్ చిత్రీకరణలో భాగంగా అనుష్క శెట్టి, మాధవన్‌లతో కలిసి చిత్రబృందం అమెరికా చేరుకుందట. కథపరంగా చాలా వరకూ అమెరికాలో చిత్రీకరించాల్సి ఉండడంతో అక్కడికి వెళ్లిన చిత్ర యూనిట్ మార్చి నాటికల్లా అమెరికాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని తిరుగుప్రయాణం అవనుంది. 

 

అనుష్కతో పాటుగా సినిమాలో అంజలి, షాలిని పాండేలు కూడా కనిపించనున్నారు. సినిమాను కోన వెంకట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నాడు. 'వస్తాడు నా రాజు', 'ముంబై 125కి.మీ' సినిమాలకు దర్శకుడిగా పనిచేశారు. 

Anushka Shetty
Madhavan


మరిన్ని వార్తలు