అనుష్క మల్టీస్టారర్ : నటీనటులు వీళ్లే..

Submitted on 21 February 2019
Anushka New Movie Shooting Starts Soon-10TV

హాట్ బ్యూటీ అనుష్క, బాహుబలి తర్వాత, కొంత గ్యాప్ తీసుకుని, ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఫేమస్ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్, కిరణ్ స్టూడియోస్, కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మిస్తుండగా, వస్తాడు నారాజు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన హేమంత్ మధుకర్ డైరెక్ట్ చెయ్యనున్నాడు. ప్రొడక్షన్ నంబర్ 3 గా తెరకెక్కబోయే ఈ మూవీలో.. ప్రముఖ నటుడు ఆర్.మాధవన్, అనుష్క, అంజలి, సుబ్బరాజు, షాలినీ పాండే, మైఖేల్ మాడ్సెన్ తదితరులు నటించనున్నట్టు మూవీ యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

గోపీ మోహన్, గోపి సుందర్, విశ్వ ప్రసాద్ తదితరులు ఈ సినిమాకి పని చేస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

R.Madhavan
Anushka
Anjali
Kona Venkat
Hemanth Madhukar

మరిన్ని వార్తలు