కోడెల కుటుంబాన్ని వెంటాడుతున్న పోలీసు కేసులు

Submitted on 18 June 2019
Another Case Filed Against Kodela Siva Prasada rao Family over cable TV business

నరసరావుపేట: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని పోలీసు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. మంగళవారం ఒక్క రోజే కోడెల కుంటుంబం పై 2 కేసులు నమోదయ్యాయి. రెండు కేసులు కేబులు టీవీ వ్యాపారానికే చెందినవి కావటం విశేషం.  కోడెల శివరామ్ ఆధ్వర్యంలో నడుస్తున్న కే-గౌతమ్ ఛానల్ పై రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఢిల్లీ హైకోర్టు అడ్వకేటరీ కమీషన్ సభ్యులు ఫిర్యాదు చేసారు. 

వివరాలలోకి వెళితే... నరసరావుపేటలో కే-గౌతమ్ ఛానల్ లో స్టార్ -మా సంస్థకు చెందిన పెయిడ్ ఛానల్స్ ను అక్రమంగా సెట్ టాప్ బాక్స్ ల ద్వారా ప్రసారం చేస్తున్నారని స్టార్ -మా యాజమాన్యం అక్రమ ప్రసారాలకు సంభంధించిన ఆధారాలతో సహా గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. స్టార్ మా సంస్థ ఆధారాలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఒక అడ్వకేటరీ కమిటీని నియమించి వారికి సహకరించవలసిందిగా స్థానిక పోలీసులను కూడా ఆదేశించడం జరిగింది. ఐతే ఛానల్ నిర్వాహకుడు అప్పటి స్పీకర్ కోడెల.శివప్రసాదరావు తనయుడు కోడెల.శివరామ్ అవ్వడంతో పోలీసులు ఈ కేసు పట్ల పెద్దగా స్పందించలేదు. 

ఢిల్లీ హైకోర్టు నియమించిన అడ్వకేటరీ కమిటీ సభ్యులు 2019, జూన్ 18 మంగళవారం మరొకసారి నరసరావుపేట 2 టౌన్ C.I ఆళహరి.శ్రీనివాసరావును సంప్రదించి కే-ఛానల్ యాజమాన్యం పై ఢిల్లీ హైకోర్టు సూచనల మేరకు చర్యలు తీసుకోవాలని మెమొరాండం సమర్పించారు. కమిటీకి బృందానికి సీనియర్ అడ్వకేట్ లక్ష్య నేతృత్వం వహించారు. 

కాగా... మరో కేసులో  కేబుల్ వ్యాపారం చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన విషయం కూడా వెలుగు చూసింది. కేబుల్ వ్యాపారం చేసే తన దగ్గర నుంచి  శివరాం ప్రసాద్  రూ. 4 లక్షలు వసూలు చేశారని  వెంకట కృష్ణ అనే వికలాంగుడు నరసరావుపేట డీఎస్సీకి మంగళవారం జూన్ 18న ఫిర్యాదు చేశాడు.   

Andhra Pradesh
guntur district
kodela siva prasada rao
Narasaraopet
Kodela sivaram
Cable TV


మరిన్ని వార్తలు