కృష్ణాజిల్లాలో మరో అమరావతి నిర్మిస్తా: రైతులు సహకరించాలి

Submitted on 12 January 2019
Another Amravati will build in Krishna District: farmers to cooperate

ఇబ్రహీంపట్నం: ఆంధ్రప్రదేశ్ లో మరో అధ్బుత కట్టడానికి నేడు శంకుస్ధాపన జరిగింది.  విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుండి గుంటూరు జిల్లాలోని ఏపీ రాజధాని అమరావతికి వెళ్లేందుకు పవిత్ర సంగమం వద్ద నిర్మించే ఐకానిక్ బ్రిడ్జికి సీఎం చంద్రబాబు నాయుడు శనివారం శంకుస్ధాపన చేశారు. దీనివల్ల హైదరబాద్-విజయవాడ జాతీయ రహాదారి రాజధానితో అనుసంధానించబడుతుంది. ఈవంతెన నిర్మాణం పూర్తయితే 40 కిలోమీటర్ల  దూరం తగ్గుతుంది. 2గంటల సమయం ఆదా అవటంతో పాటు విజయవాడలో కూడా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.  హైదరాబాద్ నుంచి వచ్చే వాహానాలు విజయవాడ వెళ్లకుండా డైరెక్టుగా అమరావతికి చేరుకోవచ్చు. అదే సమయంలో 4వ నెంబరు జాతీయ జలమార్గంలో కార్గో రవాణా కోసం వీలుగా ఈ ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు.
కృష్ణా జిల్లాను అభివృధ్ది చేయటానకి తాను సిధ్దంగా ఉన్నానని, అమరావతి రైతులు సహకరించినట్లు ఇబ్రహీంపట్నం రైతులు సహకరిస్తే కృష్ణానదికి ఇవతల ఒడ్డున అమరావతి వంటి అద్భుతమైన నగరాన్నినిర్మిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అమరావతి రైతులు సహకరించినట్లు మీరు సహకరిస్తారా అని ముఖ్యమంత్రి అడగ్గా... రైతులనుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన వచ్చింది. 
ఐకానిక్ బ్రిడ్జి విశేషాలు
బ్రిడ్జి పొడవు  3.2 కిలోమీటర్లు
అంచనా వ్యయం  రూ.1387 కోట్లు
బ్రిడ్జి మధ్యలో 0.48కి.మీ.ల భాగంలో యోగ భంగిమను పోలిన పైలాన్ నిర్మిస్తారు. 
దీనిని తీగల అమరికతో వంతెనకు అనుసంధానిస్తారు
పైలాన్ ఎత్తు 170 మీటర్లు. 
వంతెన నిర్మాణం వల్ల హైదరాబాద్,జగదల్ పూర్ జాతీయరహాదారులు అమరావతితో అనుసంధానింపబడతాయి.
ఇబ్రహీంపట్నం,పవిత్ర సంగమం నుండి రాజధాని ప్రాంతంలోని తాళ్లాయిపాలెం వరకు కృష్ణా నదిపై ఈ వంతెన నిర్మిస్తున్నారు.
ఒకో వైపు మూడు లైన్ల చొప్పున ఆరు లైన్లు ఉంటాయి.
అమరావతికి తలమానికంగా నిలిచే ఈ ఐకానిక్ వంతెనను L&T నిర్మిస్తోంది.iconic bridge

Iconic bridge
Chandrababu Naidu
pavitra sangamam
Krishna
Amaravathi
ap capital

మరిన్ని వార్తలు