ఏపీ లోక్ సభ : కాంగ్రెస్ కంటే NOTA వైపే ఓటర్ల మొగ్గు

Submitted on 24 May 2019
Andhra Pradesh Lok Sabha Election 2019 NOTA Option

పార్టీ చచ్చిపోవటం అంటే ఎలా ఉంటుందో.. ఓ పార్టీని చంపేయటం అంటే ఎలా చేస్తారో ఏపీ ప్రజలు మరోసారి కాంగ్రెస్ విషయంలో నిరూపించారు. 2014 కంటే.. ఘోరంగా తయారైంది ఏపీలో కాంగ్రెస్ దుస్థితి. కాంగ్రెస్ అంటే ఛీ..ఛీ అంటున్నారు. అలాంటి పార్టీతో జతకట్టిన టీడీపీ పరిస్థితి ఏంటో 2019 ఎన్నికల్లో చూపించారు. టీడీపీకే అలా ఉంటే.. కాంగ్రెస్ పరిస్థితి ఏంటీ అనే డౌట్ రావొచ్చు. ఏ స్థాయిలో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు అంటే.. నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి.
ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం..
లోక్ సభ స్థానాలు : -
* అమలాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గంగ గౌతమ్‌కు 7 వేల 840 ఓట్లు పడితే.. నోటాకు 16 వేల 408 ఓట్లు పడ్డాయి. 
* అనకాపల్లి నియోజకవర్గంలో శ్రీరామ మూర్తికి లక్షా 72 వేల ఓట్లు పడితే.. NOTAకు 34 వేల 877 ఓట్లు పోలయ్యాయి. 
* అనంతపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజీవ్ రెడ్డి 29 వేల 994 ఓట్లు వచ్చాయి. నోటాకు 16 వేల 406 ఓట్లు వచ్చాయి. 
* అరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రుతిదేవికి 17 వేల 656 ఓట్లు వస్తే.. నోటాకు 47 వేల 955 ఓట్లు పోలయ్యాయి. 
* బాపట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జేడీ శీలంకు 12 వేల 941 ఓట్లు.. నోటాకు 13 వేల 178 ఓట్లు వచ్చాయి. 
* చిత్తూరులో కాంగ్రెస్ అభ్యర్థి రంగప్పకు 24 వేల 497 ఓట్లు.. నోటాకు 20 వేల 503 ఓట్లు వచ్చాయి. 
* ఏలూరులో కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ రావుకు 8 వేల 317 ఓట్లు వస్తే.. నోటాకు ఆయనకు వచ్చిన ఓట్ల కంటే అధికంగా 23 వేల 861 ఓట్లు రావడం గమనార్హం. 
* గుంటూరులో కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్ వలికి 14 వేల 124 ఓట్లు వస్తే.. నోటాకు 5 వేల 972 ఓట్లు పోలయ్యాయి. 
* హిందూపురంలో కాంగ్రెస్ అభ్యర్థి తిప్పేస్వామికి 26 వేల 973 ఓట్లు పోలయితే.. నోటాకు 17 వేల 356 ఓట్లు వచ్చాయి. 
* కడపలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీరాములుకు 8 వేల 280 ఓట్లు.. నోటాకు 14 వేల 629 ఓట్లు వచ్చాయి. 
* కాకినాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ రామచంద్రమూర్తికి 8 వేల 601 ఓట్లు వస్తే.. నోటాకు 17 వేల 117 ఓట్లు పోలయ్యాయి. 
* కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థికి 36 వేల 169 ఓట్లు.. నోటాకు 7 వేల 643 ఓట్లు వచ్చాయి. 
* మచిలీపట్నం స్థానంలో గొల్లు కృష్ణకు 12 వేల 207 ఓట్లు.. నోటాకు 14 వేల 043 ఓట్లు వచ్చాయి. 
* నంద్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మనరసింహ రెడ్డికి 14 వేల 313 ఓట్లు పోలయితే.. నోటాకు 9 వేల 759 ఓట్లు వచ్చాయి. 
* నరసారావుపేట స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి సూరిబాబుకు 10 వేల 976 ఓట్లు వస్తే.. నోటాకు 13 వేల 664 ఓట్లు వచ్చాయి. 
* నర్సాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి బాపిరాజుకు 13 వేల 678 ఓట్లు.. నోటాకు 12 వేల 031 ఓట్లు వచ్చాయి. 
* నెల్లూరులో కాంగ్రెస్ అభ్యర్థి దేవకుమార్ రెడ్డికి 9 వేల 973 ఓట్లు వస్తే.. నోటాకు 17 వేల 128 ఓట్లు వచ్చాయి. 
* ఒంగోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సిరివెల్ల ప్రసాద్‌కు 8 వేల 01 ఓట్లు వస్తే.. నోటాకు 20 వేల 843 ఓట్లు రావడం గమనార్హం. 
* రాజమండ్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నల్లూరి విజయ శ్రీనివాసరావుకు 12 వేల 678 ఓట్లు వస్తే.. నోటాకు 18 వేల 064 ఓట్లు వచ్చాయి. 

 

Andhra Pradesh Lok Sabha Election 2019 NOTA Option

మరిన్ని వార్తలు