సిద్ధూపై రష్మీ చెడుగుడు : సాలే.. పాకిస్తాన్ పో

Submitted on 16 February 2019
Anchor Rashmi Gautam Fires on  Navajyoth Singh Siddhu

జమ్మూ కాశ్మీర్‌లో భారత సైనికులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అమర వీరులకు సంతాపం తెలియచేస్తూ, పాక్‌పై ప్రతీకార చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పుల్వామాలో సైనికులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత, క్రికెటర్, టెలివిజన్ ప్రజెంటర్ కమ్ పొలిటిషియన్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి.. సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా యాంకర్ రష్మీ, సిద్ధూకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదులకు కులం, మతం, వర్గం లేదు.. అంటూ సిద్ధూ చేసిన కామెంట్స్, ఓ నెటిజన్ పాకిస్థాన్ జిందాబాద్ అని చేసిన కామెంట్‌పై రష్మీ ఫైర్ అయ్యింది.

రష్మీ ఇలా రియాక్ట్ అయ్యింది :

నీ పాకిస్థాన్ గొప్పతనం ఏంట్రా? సాలే.. మావాడివై పోయావ్ కాబట్టి బతికి పోయావ్.. మాతోనే అస్థిత్వం, లేకపోతే నువ్వు దానితో సమానం.. మూసుకుని కూర్చో. అసలు దేశ విభజన టైమ్‌లో అవతలి వైపుకి వెళ్ళాల్సింది. మన దురదృష్టం కొద్దీ ఈ దేశంలో ఉన్నాడు.. అంటూ సిద్ధూని చెడుగుడు ఆడేసింది. ఇక పాకిస్థాన్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ ఇచ్చే వారిని ఎలా సమర్థిస్తావ్, ఈ దేశానికి నీ ముఖం ఎలా చూపించగలవ్.. పాకిస్థాన్‌కి పోయి ఎలుక బోనులో ముఖం పెట్టుకో పో.. దేశ వ్యతిరేక విధానం సిగ్గులేని చర్య.. అంటూ ఫైర్ అయ్యింది రష్మీ. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ స్టూడెంట్ చేసిన కామెంట్‌పై రియాక్ట్ అవుతూ... ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఈ.. నా.. కొడుకులను ఏరి పారెయ్యాలి.. అంటూ తన ఆవేశాన్ని వెళ్ళగక్కింది.. ఈ సందర్భంగా పలువురు నెటిజన్స్, రష్మీకి సపోర్ట్‌గా పోస్ట్‌లు చేస్తున్నారు. 
 

 


Read Also :  పాక్ పత్రికల్లో పిచ్చి రాతలు : పుల్వామా దాడి స్వాతంత్య్ర పోరాటమంట

Read Also :  ఆల్ పార్టీ - వ‌న్ వాయిస్ : పాక్ పై యుద్ధ‌మేనా

 

Pulwama Attack
Navajyoth Singh Siddhu
Anchor Rashmi Gautam

మరిన్ని వార్తలు