బుల్లితెర నుంచి వెండితెరకి.. హీరోగా ప్రదీప్ ఎంట్రీ

Submitted on 22 March 2019
Anchor Pradeep Turns as Tollywood hero

బుల్లితెర పై యాంకర్ ప్రదీప్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ప్రదీప్ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యాడు. '100% లవ్', 'అత్తారింటికి దారేది' వంటి సినిమాల్లో చిన్న పాత్రలు కూడా పోషించాడు.
Read Also : బీ అలర్ట్ : గూగుల్ ప్లస్, ఇన్‌బాక్స్‌ బై జీమెయిల్ మూసివేత

తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో నెం.1 మేల్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా ప్రదీప్ మాచిరాజు. ఇప్పటి వరకు బుల్లితెరపై మాత్రమే తన హవా కొనసాగించాడు కానీ త్వరలోనే వెండి తెరపై హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

సుకుమార్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా అనే వ్యక్తి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. 1947 నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్‌ సంగీతం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే ఈ అధికార ప్రకటన రానుంది.
Read Also : చెన్నైలో కలకలం : శ్రీరెడ్డిపై తమిళ నిర్మాత దాడి

Anchor Pradeep
Turns as Tollywood hero
2019

మరిన్ని వార్తలు