మెగా జాబ్ మేళా: ఏం చదువుకున్నా సరే.. ఉద్యోగానికి అర్హులే

Submitted on 22 October 2019
Anantapur Mega Job Fair at Railway High School

పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్, డిగ్రీ ఏం చదువుకున్నా సరే అర్హత తగ్గ ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు వేదికగా అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో జరుపుతున్న ఈ కార్యక్రమం అక్టోబరు 25న జరగనుంది. 

'గుంతకల్లులోని రైల్వే హైస్కూల్లో పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన వారంతా హాజరుకావచ్చు. ఆసక్తి ఉన్నవారు https://www.apssdc.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం 7013425587, 18004252422 నంబర్లలో సంప్రదించవచ్చు' అని ఏపీఎస్ఎస్‌డీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

 

APSSDC

మరిన్ని వార్తలు