రాసుకో సాంబ : అమరావతే శాశ్వత రాజధాని - పవన్ కళ్యాణ్

Submitted on 21 January 2020
Amravati is the permanent capital Pawan Kalyan

రాసుకో సాంబ..అనేది గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ పలికే డైలాగ్. అమరావతే శాశ్వత రాజధాని రాసుకోండి..విశాఖకు వెళ్లినా..అమరావతికే తీసుకొస్తానని జనసేనానీ పవన్ కళ్యాణ్ చెప్పారు. 2020, జనవరి 21వ తేదీ మంగళవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి అమరావతి రైతులు వచ్చారు. ఈ సందర్భంగా తమకు తగిలిన గాయాలను పవన్‌కు చూపించారు.

ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన మండిపడ్డారు. ఇలా దాడులు చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. కూల్చివేతలతో ప్రారంభం చేసిన వైసీపీ ప్రభుత్వం చివరకు కూలిపోతుందని శాపనార్థాలు పెట్టారు. 

అమరావతిని ఎవరూ కదపకుండా..ఇక్కడ ఉంచేలా నిర్ణయం తీసుకుంటానన్నారు. రోజు వచ్చి పోరాటాలు చేయను..మభ్య పెట్టను..డ్రామాలు చేయను..గెలిపించకపోయినా..రెండు చోట్ల ఓడిపోయినా..ప్రజలంటే ప్రేమ కోసం ఇక్కడ ఉన్నానన్నారు. భూమిని నమ్ముకుంటే మోసం చేయదన్నారు.

ఎప్పుడు విజయవాడ, అమరావతి వచ్చినా..29 గ్రామాల్లో ఏదో ఒక గ్రామంలో పర్యటించే విధంగా నిర్ణయం తీసుకుంటానన్నారు పవన్. తాను అది చేయలేదని..ఇది చేయలేదని అని మాత్రం అనొద్దని సూచించారు. విశాఖకు వెళ్లినా..రాజధానిని ఇక్కడకు తీసుకొస్తానని మరోసారి హామీనిచ్చారు పవన్. 

* 2020, 20వ తేదీ సోమవారం శాసనసభలో 3 రాజధానులు, CRDA రద్దు బిల్లులు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. 
* దీనికి 2020, 21వ తేదీ మంగళవారం ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. 
* కానీ మండలిలో తీవ్రమైన ప్రతిఘటన టీడీపీ నుంచి ఎదురైంది. 

* ఎలాగైనా బిల్లులను ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 
* ఏకంగా మండలిని రద్దు చేయాలని ప్లాన్ చేస్తోంది. 
* ఇందుకు రాత్రి 10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ నిర్వహించాలని యోచిస్తోందని సమాచారం. 

Read More : మండలి రద్దు కోసం : ఏపీ కేబినెట్ అత్యవసర మీటింగ్

Amravati
permanent
capital
Pawan kalyan
AP Legislative Council

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు