రాజ్యసభ సమావేశాలు : కాశ్మీర్‌పై షా స్టేటస్ రిపోర్టు

Submitted on 20 November 2019
Amit Shah gives status report in Rajya Sabha

కాశ్మీర్‌లో కర్ఫ్యూ లేదని, సాధారణ స్థితి నెలకొని ఉందన్నారు కేంద్ర హోం మంత్రి అమీత్ షా. లోయలో ఇంటర్ నెట్ నిషేధాన్ని ఆయన సమర్థించుకున్నారు. తదుపరి నిర్ణయాన్ని స్థానిక సెక్యూర్టీ అధికారులు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 2019, నవంబర్ 20వ తేదీ బుధవారం రాజ్యసభలో కాశ్మీర్‌పై స్టేటస్ రిపోర్టు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాశ్మీర్‌లో ఇంటర్‌నెట్ పునరుద్ధిరించాలని సెక్యూర్టీ అధికారులు నిర్ణయించిన వెంటనే అమల్లోకి వస్తుందన్నారు. దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ అధికారులు నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ఇక్కడ పాక్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, అందువల్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని సభలో తెలిపారు. 

అంతేగాకుండా ఏ పీఎస్ పరిధిలో కర్ఫ్యూ విధించలేదని, మెడిసిన్స్‌ లభ్యతలో ఎలాంటి సమస్య లేదని చెప్పుకొచ్చారు. ఇందుకు మొబైల్ మెడిసిన్ వ్యాన్లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అక్కడి ఆరోగ్య శాఖ ఈ సేవలను చూస్తుందన్నారు. మధ్యలో కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ జోక్యం చేసుకున్నారు. కాశ్మీర్‌లో ఆంక్షల కారణంగా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సభకు తెలిపారు. దీనిని షా ఖండించారు. రిపోర్టుపై తాను చర్చించడానికి సిద్ధమని, ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. జమ్మూ కాశ్మీర్‌లో సాధారణ స్థితి నెలకొందని అమిత్ షా తెలిపారు. 

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఆంక్షలు విధించారు. దీంతో పాఠశాలలు, షాపులు మూతపడ్డాయి.  మళ్లీ నేటి నుంచి అవి తెరచుకోనున్నాయి. జనజీవనం సాధారణ స్థాయికి చేరుకోవడంతో పాఠశాలలు,దుకాణాలు తెరవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో మూడు నెలలు పాఠశాలలకు దూరంగా విద్యార్థులకు...నేటి నుంచి మళ్లీ తరగతులు ప్రారంభంకానున్నాయి. మళ్లీ పాఠశాలకు వెళ్లబోతున్నందుకు ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. 
Read More : కోల్ కతా గులాబీ మయం : పింక్ బాల్ టెస్టు టికెట్లు సోల్డ్ అవుట్

Amit Shah
gives
status report
rajya sabha

మరిన్ని వార్తలు