గ్రేట్ న్యూస్ : కోవిడ్ - 19 (కరోనా) వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టిన కాలిఫోర్నియా!

Submitted on 14 February 2020
American biotech company says it created a coronavirus vaccine three hours

చైనాను కోవిడ్ - 19 (కరోనా) వైరస్ భయకంపితులను చేస్తోంది. రోజుకు వందలాది మంది మృతి చెందుతున్నారు. వేల సంఖ్యలో వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. మొత్తం 1, 310 మంది చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే..కాలిఫోర్నియా ల్యాబ్‌లో వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టినట్లు అమెరికన్ బయోటెక్ కంపెనీ ప్రకటించింది. టీకాను రికార్డు సమయంలో మార్కెట్‌లోకి తీసుకరావడానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని, కేవలం మూడు గంటల్లోనే ఇది సాధ్యమైందని ఇనోవియో అధ్యక్షులు, సీఈవో డాక్టర్ జె. జోసెఫ్ కిమ్ ప్రకటించారు. 

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం పనిచేస్తామని కంపెనీ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత..ఇనోవియో స్టాక్ వాటా అమాంతం పెరిగిపోయింది. బీజింగ్ అడ్వాసిన్ చైనా కంపెనీతో అమెరికా కంపెనీకి భాగస్వామ్యం ఉంది. బిలియనీర్ బిల్ గేట్స్ మద్దతుతో ఇనోవియాకు రూ. 9 మిలియన్లు అందాయి. వైరస్‌లకు చాలా వ్యాక్సిన్‌లు కనిపెట్టడం జరిగిందని, మెర్స్ వైరస్, కోవిడ్ - 19 ఒకే రకానికి చెందినవని అని కిమ్ వెల్లడించారు. కేవలం ఏడు నెలల్లోనే జికా వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్ చేయడం జరిగిందని, ప్రస్తుతం తమ రికార్డును తామే అధిగమించాలని చూస్తున్నట్లు తెలిపారు. 


కోవిడ్ - 19 వైరస్‌ను అరికట్టడానికి నోవియో ఒక యుద్ధమే చేస్తోందని తెలిపారు. మరో యుఎన్ సంస్థ, మేరీల్యాండ్‌కు చెందిన నోవావాక్స్ కరోనా వైరస్‌కు కేవలం మూడు నెలల్లోనే వ్యాక్సిన్ తయారు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ వ్యాక్సిన్లు అభివృద్ధి చేయడానికి మాత్రం సంవత్సరాలు పట్టవచ్చనే అభిప్రాయాలున్నాయి. ఎబోలా వైరస్‌కు 90 రోజుల్లోనే వ్యాక్సిన్ తయారు చేసింది ఈ సంస్థ. 

American
biotech company
coronavirus
Vaccine
three hours
Pennsylvania
Dr. J. Joseph Kim
Inovio's president
CEO

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు