గుడ్ న్యూస్ : రూ.500కే అమెజాన్ Prime మెంబర్‌షిప్ 

Submitted on 12 July 2019
Amazon's latest offer will let you have prime membership for Rs 500

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో లేటెస్ట్ ఆఫర్‌‌తో ముందుకొస్తోంది. విద్యార్థుల కోసం మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్యాకులపై డిస్కౌంట్ ఆఫర్లు అందించిన అమెజాన్.. యువకుల కోసం ‘Youth’ పేరుతో కొత్త Offer తీసుకొస్తోంది. ఈ ఆఫర్ కింద ఏడాదికి రూ.999 ప్రైమ్ మెంబర్ షిప్ కేవలం రూ.500లకే సొంతం చేసుకోవచ్చు. వార్షిక ప్రైమ్ మెంబర్ షిప్ రూ.999తో సైన్ అప్ అయితే చాలు.. 50శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.

ప్రైమ్ డే వార్షిక దినోత్సవం సందర్భంగా ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా జూలై 15 నుంచి జూలై 16 వరకు ప్రైమ్ డే ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా అమెజాన్ లోని ప్రొడక్టుల కొనుగోలుపై డీల్స్, డిస్కౌంట్లను పొందవచ్చు. 

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కంపెనీకి 10కోట్ల మంది ప్రైమ్ మెంబర్స్ ఉన్నారు. అయితే.. ఈ ఆఫర్ అన్ని వయస్సుల వారికి వర్తించదు. యువకుల వయస్సు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. వీరికి మాత్రమే 50శాతం క్యాష్ బ్యాక్ తో ప్రైమ్ మెంబర్ షిప్ యూత్ ఆఫర్ వర్తిస్తుంది.

ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రైమ్ ద్వారా షాపింగ్, ఎంటర్ టైన్ మెంట్, ఫుడ్ డెలివరీ, ట్రావెల్ వంటి వాటికి వినియోగించుకోవచ్చునని అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్, డైరెక్టర్ అక్షయ్ సాహి తెలిపారు. ప్రైమ్ డే 2019 ఆఫర్ ను లాంచ్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. యంగ్ కస్టమర్లు ప్రైమ్ మెంబర్లగా 48 గంటల పాటు ఎంటర్ టైన్ మెంట్ ఎంజాయ్ చేసుకోవచ్చు. 

రూ. 500 క్యాష్ బ్యాక్ పొందాలంటే :
*  అమెజాన్ ప్రైమ్ యూజర్లు Amazon.in లో లాగిన్ అవ్వాలి.
* ప్రైమ్ మెంబర్ షిప్ ఆఫర్.. ప్రైమ్ మెంబర్ వయస్సు ఆధారంగా వెరిఫై అవుతుంది.
* యూజర్ల వయస్సు 18ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. 
* అమెజాన్ యాప్ లో www.amazon.in/prime ఓపెన్ చేసి Sign Up కావాలి. 
* యూత్ ఆఫర్.. అని బ్యానర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
* క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అమెజాన్ పే బ్యాలెన్స్, నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.999 చెల్లించాలి.
* PAN కార్డు కాపీతో పాటు మెయిలింగ్ అడ్రస్ ప్రూఫ్, ఒక ఫొటోను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
* వెరిఫికేషన్ పూర్తి అయ్యాక రూ.500 నేరుగా అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది. 
* క్యాష్ బ్యాక్ అమెజాన్ పేలో క్రెడిట్ అవ్వడానికి 10రోజుల సమయం పడుతుంది.
* ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ ను బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జ్, బుక్ మై షో, స్విగ్గీ, డొమినో, రెడ్ బస్ అన్నింటికి అమెజాన్ పే ద్వారా చెల్లించవచ్చు. 

amazon
Prime membership
prime members
Akshay Sahi
Youth offer 

మరిన్ని వార్తలు