అమెజాన్.. వాయిస్ డివైజ్ : మనిషి Emotions చెప్పేస్తుంది!

Submitted on 24 May 2019
Amazon is working on a device that can read human emotions

ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త డివైజ్ ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. వాయిస్ యాక్టివేటడ్ అండ్ వేరబుల్ డివైజ్ డెవలప్ చేస్తోంది. ఈ డివైజ్.. మనుషుల భావోద్వేగాలను వెంటనే పసిగట్టేస్తుంది. వాయిస్ గాడ్జెట్ ను అచ్చం వాచ్ మాదిరిగానే ఈజీగా చేతి మణికట్టుకు ధరించవచ్చు.  మనిషిలోని ఉద్వేగాలను రీడ్ చేయగల సామర్థ్యం దీనిలో ఉంది.

మనిషి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది.. వారి ఆలోచన విధానం ఎలా ఉందో ఈ ప్రొడక్ట్ చెప్పేస్తోందని ఇంటర్నల్ డాక్యుమెంట్లను బ్లూమ్ బెర్గ్ చేసిన రివ్యూలో తేలింది. ల్యాబ్ 126, హార్డ్ వేర్ డెవలప్ మెంట్ గ్రూపు, అమెజాన్ ఫైర్ ఫొటో, ఎకో స్మార్ట్ స్పీకర్, అలెక్సా వాయిస్ సాఫ్ట్ వేర్ టీం సంయుక్తంగా ఈ ప్రొడక్టుపై వర్క్ చేస్తున్నట్టు బ్లూమ్ బెర్గ్ తెలిపింది. స్మార్ట్ ఫోన్ యాప్ తో పనిచేసేలా ఈ వాయిస్ డివైజ్ ను డిజైన్ చేస్తున్నారు. 

చేతికి ధరించగానే.. ఫీలింగ్స్ పసిగట్టేస్తుంది :
బ్లూమ్ బెర్గ్ రివ్యూ డాక్యుమెంట్ల ప్రకారం.. ఇందులో సాఫ్ట్ వేర్ తో మైక్రో ఫోన్లు కలిసి ఉండటంతో దీన్ని మనిషి చేతికి ధరించగానే వారిలోని ఎమోషన్స్ ఏంటో గుర్తించి వారి వాయిస్ ద్వారానే చెప్పిస్తుంది. ఈ డివైజ్ ధరించిన వ్యక్తి ఇతరులతో ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలో టెక్నాలజీ సూచనల ద్వారా తెలియజేస్తుంది. వాయిస్ సాఫ్ట్ వేర్ ఎనాలిసిస్ తో యూజర్ ఫీలింగ్, వివేకం, సంతోషం, కోపం, చింత, బాధ, భయం, విసుగు, ఒత్తిడి సహా ఇతర భావోద్వేగాలను పసిగట్టేస్తుంది. యూజర్ల ఎమోషన్స్ ఆధారంగా వారికి అవసరమైన ప్రొడక్టులను రికమండ్ చేసేలా అమెజాన్ డిజైన్ చేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. 

అమెజాన్.. కమర్షియల్ డివైజ్ ఇదే :
వాయిస్ డివైజ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఎన్నాళ్లూ కొనసాగుతుందనేది క్లారిటీ లేదు. అమెజాన్ అందించబోయే కమర్షియల్ డివైజ్ గా నిలువనుంది. ఈ డివైజ్ డెవలప్ ప్రాజెక్ట్ లో Dylan అనే కోడ్ పేరుతో పనిజరుగుతోందని పేరు చెప్పేందుకు నిరాకరించిన వ్యక్తి తెలిపారు. ఈ ట్రయల్  ప్రాజెక్టు.. ప్రొటోటైప్ హార్డ్ వేర్ లేదా ఎమోషన్ డెటెక్టింగ్ సాఫ్ట్ వేర్ పై జరుగుతుందా? అనేది సదరు వ్యక్తి రివీల్ చేయలేదు.

కానీ, దీనిపై అమెజాన్ స్పందించేందుకు నిరాకరించింది. వాయిస్ అసిస్టెంట్ డివైజ్ ను డెవలప్ చేసేందుకు అమెజాన్ పబ్లిక్ గానే పలు టెక్నాలజీ దిగ్గజాలతో చర్చలు జరిపింది. ఇటీవల షాపింగ్ సెర్చ్ యూజర్ల వాయిస్ ను అమెజాన్ టీం ఎకో లైన్ వాయిస్ యాక్టివేటెడ్ స్పీకర్ల ద్వారా ఆడియో క్లిప్స్ వింటున్నట్టు ఈ ఏడాదిలో బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్ తెలిపింది.  

అమెజాన్ అందించే వాయిస్ కమాండ్స్ లో ఇప్పటికే అలెక్సా వాయిస్ సాఫ్ట్ వేర్ ఎంతో పాపులర్ అయింది. ఇటీవలే కంపెనీ.. తమ ఫైర్ బ్రాండెడ్ వీడియో స్ట్రీమింగ్ డివైజ్ లైన టెలివిజన్, ట్యాబెట్ల బేసిడ్ డివైజ్ ల్లో వాయిస్ కంట్రోల్ సిస్టమ్ ను అనుసంధానం చేసింది. ఈ ఏడాదిలో అమెజాన్ కంపెనీ.. ఆపిల్ ఇయర్ పాడ్స్ తరహాలో అలెక్సా వాయిస్ సాఫ్ట్ వేర్ తో వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 

amazon
 human emotions
 voice-activated
wearable device
Bloomberg

మరిన్ని వార్తలు