వాయిస్ సెర్చ్ చేశారా.. మీ గుట్టు అమెజాన్ చేతిలో ఉన్నట్లే

Submitted on 12 April 2019
AMAZON LISTENING EVERY VOICE SEARCH

టెక్నాలజీ పెరిగి పెరిగీ.. మన సీక్రెట్స్ అన్నింటినీ మనమే మార్కెట్‌లో పెట్టుకునేలా చేస్తోంది. సుఖం పెరిగిన యాండ్రాయిడ్ యూజర్లు ఏం కావాలన్నా.. ఒకే గూగుల్ అంటూ అలవాటు చేసుకున్నారు. ఇంకా స్మార్ట్‌గా ఆలోచించేవారు తమ హెడ్ ఫోన్స్ నుంచే సెర్చింగ్ చేస్తున్నారు. ఈ సదుపాయాలు గూగుల్, ఫేస్‌బుక్ వంటి వాటిలోనే కాకుండా యాపిల్‌ సిస్టమ్‌ల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. 
Read Also : చంద్రుడిపై కూలిన ఇజ్రాయెల్ అంతరిక్ష నౌక

అయితే వీటితో పాటు మనకు పూర్తిగా సంబంధం లేని అమెజాన్ కూడా మనం మాట్లాడినవి.. సెర్చ్ చేసినవి వినేస్తుందట. ఇలా మనం చెప్పినవన్నీ.. క్షణాల్లో మనముందుంచడానికి వెనుక అలెక్సా పనిచేస్తుంది. వెబ్ సైట్ స్పీడ్.. ర్యాంకింగ్ అంశాల కోసమే సెర్చ్ చేసే మనం.. అలెక్సా పసిగడుతుందని తెలుసుకోలేకపోతున్నాం. అయితే ఇలా అలెక్సాకు తెలియడం ద్వారా అమెజాన్  ఆ డేటా మొత్తాన్ని రీడ్ చేస్తుందట. 

అలెక్సా పనితీరులను మానిటర్ చేస్తున్న అమెజాన్ ఉద్యోగులు మనం నిత్యవాడకంలో చేసే సెర్చే ఆఫ్షన్లు మొత్తం గమనిస్తున్నారు. వీటి కోసమే ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకుని రోజుకు 9గంటల పని చేసి షిప్ట్‌ల వారీగా ఆడియో క్లిప్‌లు వినేందుకు కేటాయించింది అమెజాన్.

ఒక్కొక్కరూ రోజు పూర్తయ్యేసరికి 1000 ఆడియో క్లిప్‌లను వింటారట. దీని వల్ల అమెజాన్ కి ఉపయోగమేంటనే ప్రశ్న రాకపోదు. వాటిలో ఎక్కడైనా అమెజాన్ గురించి అడిగారా, అడిగేందుకు ఎలా మాట్లాడుతున్నారు. ఏ పదాలు వాడుతున్నారనేది తెలుసుకోవడం కోసమే.. అందరి రహస్యాలను వింటున్నట్లు ఆ సంస్థ చెప్పుకొస్తుంది. 

అమెజాన్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. 'సెర్చ్ ఆప్షన్‌లో ఎవరెవరేం చెప్పినా అన్నీ వింటాం. కానీ, అవన్నీ ప్రైవసీ నిబంధనలకు మాత్రమే లోబడి ఉన్నాయి. ఎవరి వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టం' అంటూ సర్ది చెప్పుకున్నారు. 
Read Also : అమ్మో.. బాంబు తుపాన్.. అమెరికా గజగజ

amazon
cyber fraud
human Voice 

మరిన్ని వార్తలు