అప్లయ్ చేసుకోండి : అలహాబాద్ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ 

Submitted on 16 April 2019
Allahabad Bank recruits 92 Specialist Officer Posts.

అలహాబాద్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్(ఎస్ఓ) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 92 ఖాళీలు  ఉన్నాయి. వీటిలో 
సెక్యూరిటీ ఆఫీసర్ 10
సివిల్ ఇంజనీర్ 4
కంపెనీ సెక్రటరీ 1
ఫైనాన్షియల్  అనలిస్ట్  51
మేనేజర్ (ఫైర్ సేఫ్టీ, లా, ఐటీ, ఈక్విటీ/ మ్యూచువల్ ఫండ్ డెస్క్ )26 పోస్టులు ఉన్నాయి. 

అర్హత:  పోస్టులను బట్టి  సంబంధింత  విభాగంలో బీఈ/ బీటెక్/ బ్యాచిలర్ డిగ్రీ/ పీజీ డిగ్రీ సీఎఫ్ఏ/ఎంబీఏ/ఐసీడబ్ల్యూఏ/ పీజీడీఎం/తత్సమానమైన  కోర్సుల్లో ఉత్తీర్ణత పొంది సంబంధిత  విభాగంలో పని చేసిన అనుభవం ఉండాలి. 
Read Also : ప్లీజ్ డౌన్ లోడ్ : ఏపీ ఎంసెట్ హాల్ టిక్కెట్లు రెడీ

వయస్సు:  పోస్టునుబట్టి  2019 ఏప్రిల్1 నాటికి 20-35 సంవత్సరాల మధ్యఉండాలి.  ఓబీసీ లకు మూడేళ్లు, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఐదేళ్లు, PWD లకు పదేళ్లు  గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. 
దరఖాస్తు ఫీజు: SC,ST,PWD, లకు రూ.100 మిగిలిన వారికి  రూ.600

ఏప్రిల్ 09, 2019 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.  దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 29, 2019. అర్హులైన అభ్యర్థులు గడువులోగా అలహాబాద్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.allahabadbank.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

అలహాబాద్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2019 ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్/ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. రెండింట్లో వచ్చిన ఫలితాలను బట్టి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వారి వారి అర్హతను బట్టి అభ్యర్థులు తమకు సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: ఏప్రిల్ 9, 2019
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 29, 2019
ఆన్‌లైన్ పరీక్ష కాల్ లేటర్ డౌన్ లోడ్ తేదీ: జూన్ 2019(తాత్కాలికం)
ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: జూన్ 2019(తాత్కాలికం)
పూర్తి వివరాలకు www.allahabadbank.in ను సంప్రదించండి. 
Read Also : హైదరాబాద్ లో దారుణం : మందు పార్టీ ఇచ్చి.. యువతిపై గ్యాంగ్ రేప్

jobs
government jobs
Bank Jobs
Allahabad Bank


మరిన్ని వార్తలు