PNBలో ఆ మూడు బ్యాంకులు విలీనం!

Submitted on 22 May 2019
Allahabad Bank, Andhra Bank, Oriental Bank may merge with PNB: report

పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)లో మరో మూడు చిన్న బ్యాంకులు విలీనం కానున్నాయి. వచ్చే మూడు నెలల్లో స్టేట్ రన్ బ్యాంకులను పీఎన్ బీ ఏకీకృతం చేయనున్నట్టు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. ఒరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (OBC), ఆంధ్రా బ్యాంకు, అలహాబాద్ బ్యాంకులను ఢిల్లీ ఆధారిత బ్యాంకు పీఎన్ బీలో విలీనం కానున్నట్టు నివేదిక తెలిపింది.

ఏప్రిల్ నెలలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (UBI), బ్యాంకు ఆఫ్ ఇండియా (BoI) బ్యాంకులు PNB బ్యాంకులో విలీనం అవుతాయని వార్తలు వచ్చాయి. కానీ, మరో మూడు కొత్త బ్యాంకులు విలీనం కానున్నట్టు రాయిటర్స్ నివేదిక పేర్కొంది.

ఈ మూడు బ్యాంకులను పీఎన్ బీ.. తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టు తెలిపింది. రాష్ట్ర స్థాయి బ్యాంకింగ్ సెక్టార్ లో అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు భారత ప్రభుత్వం.. చిన్న స్థాయి బ్యాంకు రంగాలను విలీనం చేయాలనే యోచనలో ఉన్నట్టు రాయిటర్స్ వర్గాలు తెలిపాయి. మూడు బ్యాంకుల విలీనం విషయంలో పీఎన్ బీ నుంచి గానీ లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

2019 ఏడాదిలో ఏప్రిల్ నెలలో పీఎన్ బీలో మూడు బ్యాంకులు డెనా బ్యాంకు, విజయ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా విలీనం అయిన సంగతి తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తర్వాత రెండో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకు పీఎన్ బీలో 9వేల 500 బ్రాంచ్ లు, 13వేల 400 ఏటీఎంలు, 85వేల ఉద్యోగులు ఉన్నారు.  

Allahabad Bank
Andhra Bank
Oriental Bank
PNB

మరిన్ని వార్తలు