గణేష్ నిమజ్జనం : 21 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

Submitted on 11 September 2019
all arrangements have been made for Ganesh immersion says Hyderabad CP Anjani Kumar

హైదరాబాద్‌ లో గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ అన్నారు. 21 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మొహరం వేడుకలు కూడా ప్రజల సహకారంతో ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. గణేష్ నిమజ్జన ప్రక్రియను కూడా ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. 

ఏపీతో పాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపామని చెప్పారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, రైల్వే పోలీసు ఫోర్స్‌తో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 17 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. 35 గంటల పాటు నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

జీహెచ్‌ఎంసీ సమన్వయంతో సీపీ ఆఫీస్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. 11వేల 198 విగ్రహాలకు జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో పర్యవేక్షణ బృందం ఉంటుందని చెప్పారు. 3 లక్షలకు పైగా సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు సీపీ. బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు 261 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు. 

ఖైరతాబాద్‌ గణేష్‌ కోసం 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఖైరతాబాద్‌ వినాయకుడి శోభాయాత్ర 2.5 కిలోమీటర్ల మేర కొనసాగనుందన్నారు. నిమజ్జన ప్రక్రియలో భాగంగా ఏమైనా సమస్యలు వస్తే 9490616555 నెంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని సీపీ సూచించారు.

Also Read : రాచకొండ పరిధిలోని 25 చెరువుల్లో గణేష్ నిమజ్జనం : సీపీ భగవత్
 

Arrangements
Ganesh immersion
Hyderabad
CP Anjani Kumar

మరిన్ని వార్తలు