ఆ వెడ్డింగ్ కార్డ్ మాది కాదు బాబోయ్ : అలియా భట్

Submitted on 23 October 2019
Alia Bhatt Reacted to Her and Ranbir Kapoor's Fake Viral Wedding Card

కెమెరాల కళ్లన్నీ ఎప్పుడూ సెలబ్రిటీల మీదే ఉంటాయి.. ఎవరైనా హీరో, హీరోయిన్ ఆఫ్ స్క్రీన్ కలిసి కనిపించినా, వారి గురించి ఏవైనా గుసగుసలు వినిపించినా రచ్చ మామూలుగా ఉండదు.. బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌ల ఎంగేజ్‌మెంట్ 2020 జనవరి 22న జరగనుందని, ఓ వెడ్డింగ్ కార్డ్ (ఇన్విటేషన్ కార్డ్) గతకొద్ది రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొట్టింది..

అందరూ ఆ వెడ్డింగ్ కార్డ్ అఫీషియల్ అనుకున్నారు. కట్ చేస్తే.. అలియా చెప్పే వరకు అది ఫేక్ అని ఎవరికీ తెలియదు. రీసెంట్‌గా ముంబాయి ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంట పడిన అలియాను ఎంగేజ్‌మెంట్ గురించి అడగ్గా..‘అది ఫేక్ వెడ్డింగ్ కార్డ్’ (ఇన్విటేషన్ కార్డ్) అని చెప్పింది.

Read Also : ‘హోటల్ ముంబాయి’ ట్రైలర్ - నవంబర్ 29 ఇండియా రిలీజ్

ఆ వెడ్డింగ్ కార్డ్‌లో ‘అలియా’ పేరు స్పెల్లింగ్‌తో పాటు ఆమె తండ్రి పేరు మహేష్ భట్ అయితే ముఖేష్ భట్) కూడా తప్పుగా ఉండడంతో ‘అవును.. అది ఫేక్ వెడ్డింగ్ కార్డే’ అని కన్ఫమ్ చేశాయి బాలీవుడ్ వర్గాలు.. ప్రస్తుతం రణ్‌బీర్, అలియా కలిసి ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చేస్తున్నారు.

Ranbir Kapoor
Alia Bhatt
Fake Wedding Card

మరిన్ని వార్తలు