అక్షరం

Sunday, April 24, 2016 - 09:27

సాహిత్యం సమాజాన్ని పూర్తిగా మార్చలేక పోవచ్చు. కాని మంచి సమాజం ఎలా ఉండాలో దిశానిర్దేశం చేస్తుంది. సృజనకారులు సమున్నత సమాజం కోసం ఎప్పుడూ కలలుగంటూ ఉంటారు. నిరంతరం రచనలు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తుంటారు. అలాంటి వారిలో ఒడిశాకు చెందిన దళిత కవి హల్దార్ నాగ్ ఒకరు. సాహిత్యం ఒక గొప్ప సృజన ప్రక్రియ. సృజనాత్మక రచనలు చేయడానికి యూనివర్సిటీ డిగ్రీలతో పనిలేదని నిరూపించారు మూడో తరగతి...

Sunday, April 10, 2016 - 14:57

కథలు రాయాలనే ఆసక్తి మీకుందా? గొప్ప కథలుగా కొన్ని కథలనెందుకు భావిస్తారో, కొందరు రచయితల శైలికి పాఠకుడెందుకు అబ్బురపడతాడో.. తెలుసా మీకు? ఓవరాల్ గా కథ వెనుక కథ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో క్లిక్ చేయండి. 

Sunday, April 10, 2016 - 13:44

సాహిత్యం సమాజానికి దిక్సూచి లాంటిది. మనిషికి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచేది సాహిత్యమే... అంతేకాదు ఒక్కోసారి సాహిత్యం ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన సృజనకారులెందరో మన మధ్యన ఉన్నారు. కష్టజీవులకు అటు ఇటు నిలిచేవాడే నిజమైన కవి అన్నాడో మహాకవి. దళిత బహుజన కవిత్వాన్ని బలంగా వినిపిస్తూ కష్టజీవుల...

Sunday, April 3, 2016 - 13:04

ఇటీవల నెల్లూరులోని టి.వి.యస్ కళ్యాణ సదన్ లో ప్రముఖ కవి ఈతకోట సుబ్బారావ్ రాసిన కాకిముద్ద కవితా సంపుటిని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ ఆవిష్కరించారు. చిన్ని నారాయణరావ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వీరయ్య,డా.సుధాకర్,రచయిత్రి జయప్రభ తదితరులు పాల్గొన్నారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Sunday, April 3, 2016 - 12:47

సాహిత్యం సమాజానికి దిక్సూచిలాంటిది. ఉన్నత సమాజం ఎలా ఉండాలో సాహిత్యం తెలియజేస్తుంది. మానవ సమూహాలు విలువలవైపు ఎలా అడుగులేయాలో నేర్పిస్తుంది. ప్రజలను చైతన్య ప్రవాహాలుగా మార్చిన సృజనకారులలెందరో మన మధ్య ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ గేయకవి గంగిరెడ్డి సన్యాసరావ్ ఒకరు. కనుచూపు కోల్పోయిన కళాకారుడు. అయితేనేం తన మనోనేత్రాన్ని తెరిచాడు. సమాజాన్ని తన అంతర్ కళానేత్రంతో వీక్షించాడు....

Sunday, April 3, 2016 - 12:38

తెలుగు కథకు స్థానికతను సంతరించిన కథన శిల్పి వారణాసి నాగలక్ష్మి. ఆమె కథలు మానవ సంబంధాల మధురిమల తియ్యదనాన్ని తెలియజేస్తాయి. అంతరంగాల కల్లోలాలకు అద్దం పడతాయి. గతానికి వర్తమానానికి వారథిగా నిలుస్తాయి. విలువలను గుర్తు చేస్తాయి. గొప్ప ఈస్తటిక్ సెన్స్ తో చదువరుల మెదళ్ళకు పదును పెడతాయి. సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. సమాజంలోని అనేక కోణాలను, మధ్యతరగతి ప్రజల బతుకు చిత్రాలను కథలుగా...

Sunday, March 27, 2016 - 13:12

సాహిత్యం సామాజిక గమనాన్ని అక్షరీకరిస్తుంది. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుంది. భావోద్వేగాలకు గురిచేస్తుంది. రసానందాన్ని కలిగిస్తుంది. కథైనా కవితైనా మనిషిని స్పందింపచేయాలి. అనుభూతుల్లో ముంచెత్తాలి. అలాంటి కథలు, కవితలు రాసిన వారెందరో ఉన్నారు. వారిలో అద్భుత కథలు రాసిన ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ ప్రత్యేక కథనంతో పాటు, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన...

Sunday, March 20, 2016 - 13:08

ఒకప్పుడు తెలంగాణా ప్రాంతంలో ప్రజలు దొరల దోపిడీకి గురయ్యారు. దొరల పీడనను అనుభవించారు. దేశ్ ముఖ్ ల దౌర్జన్యాలకు బలయ్యారు.. నిజాం నిరంకుశ పాలనలో క్రూరంగా హింసించబడ్డారు. రజాకార్ల తుఫాకీ గుళ్లకు పిట్టల్లా రాలిపోయారు.. అలాంటి ప్రజల దుర్భర బతుకులను కథలుగా మలిచారు వుప్పల నరసింహం. ప్రముఖ కథకులు, సీనియర్ పాత్రికేయులు, పరిశోధకులు వుప్పల నరసింహంపై ప్రత్యేక కథనం. మరిన్ని విషయాల కోసం...

Sunday, March 20, 2016 - 13:01

ఒకప్పుడు సాహిత్యం కేవలం రాజాస్థానాలకే పరిమితమై ఉండేది. నేడది ప్రజాబాహుళ్యాన్ని మేల్కొలిపే పొద్దుపొడుపుగా మారింది. అణగారిన వర్గాలను ఆలోచింపజేస్తోంది. అందుకే అక్షరాస్యులుగా మారిన అట్టడుగు కులాల నుండి కలాలు ఎగసిపడుతున్నాయి. తరతరాలుగా తమ జాతి జనులకు జరిగిన చారిత్రక విద్రోహాలను ఎండగడుతున్నాయి. అలాంటి వారిలో దళితుల సాంస్కృతిక మూలాలను కవిత్వీకరించారు చిత్రం ప్రసాద్. దళిత కవులు...

Sunday, March 6, 2016 - 13:07

కథ కంచికి అనే కాలం పోయింది. ఇవాళ కథలు ఇంటిల్లిపాది చదవాల్సిన అవసరం వచ్చింది. పిల్లలు పెద్దలు విధిగా కథలు చదివి తీరాలంటుంది కన్నెగంటి అనసూయ. సున్నితమైన భావాలను, అంతులేని అనుభూతులను తన కథల్లో పలికించే కన్నెగంటి అనసూయ... మనసులను కదిలించే కథలు రాస్తున్నారు. పాఠకుల మనసులు చూరగొంటున్నారు. మానవ సమూహాల మానసిక కల్లోలాలను, అనుభవాలను, ఆవేదనలను, అనుభూతులను అక్షరాల్లోకి వొంపి తెలుగు కథా...

Sunday, March 6, 2016 - 13:06

నాకు సముద్ర సయ్యాటలు తెలియవు.. ఇసుకలో రాసుకున్న ప్రేమ గుర్తులు లేవు... అంటూ కవిత్వం వినిపిస్తున్నారు అదిలాబాద్ జిల్లాకు చెందిన డా. ఉదారి నారాయణ. వస్తు శిల్పవైవిధ్యంతో సరికొత్త అభివ్యక్తితో గుండెల్లోకి సూటిగా దూసుకెళ్ళే తూటాల్లాంటి కవితలు రాస్తున్న ఉదారి నారాయణ పరిచయ కథనం. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Sunday, March 6, 2016 - 13:02

అక్షరాలు కొందరికి వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు కావచ్చు.. అక్షరాలు కొందరికి పచ్చని తోటల్లో ఎగిరే సీతాకోక చిలుకలు కావచ్చు.. కాని నేటి కవులకు... రచయితలకు మాత్రం అక్షరాలు అట్టడుగు వర్గాలకు అందని ద్రాక్షాఫలాలు . అందుకే ..నేడు కవులు కథారచయితలు బరువైన గుండెలతో సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. ఎనబయ్యవ దశకంలో దళిత కవిత్వం ఒక ఉప్పెనలా ఎగసిపడింది. ఒక ప్రభంజనంలా పెనుదుమారం రేపింది...

Sunday, February 28, 2016 - 13:12

ఒకప్పడు రాజులు అగ్రవర్ణాల జీవితాలే సాహిత్యంగా చెలామణి అయ్యింది. నిన్నమెున్నటిదాక  కళాఖండాలుగా పేరుపడ్డసినిమాల కథలన్నీ అగ్రవర్ణజీవితాల చుట్టూ అల్లబడినవే.. అయితే దళితబహుజనులు చదువుకొని సాహిత్యరంగంలో ప్రవేశించడంతో డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్టుగా మారింది. ఇప్పడు దళితులు బహుజనులు కావ్యవస్తువులుగా కవితా వస్థువులుగా కథాపాత్రలుగా మారుతున్నారు.అలాంటి వారిలో సఫాయిలు కూడా ఉన్నారు....

Sunday, February 28, 2016 - 13:10

కొందరు కష్టపడకున్నా ప్రతిభలేకున్నా అనుచరగణసహకారంతో గొప్ప రచయితలుగా వెలిగి పోతుంటారు.మరికొందరు ఎంత కష్టపడినా...తమ కథలను కవితలను మార్కెటింగ్ చేసుకోలేక పోవడంవల్ల వెలుగులోనికి రాలేక పోతుంటారు.అలాంటి వాడే కథారచయిత గణపతిరావ్. ఆయన ఎన్నో కథలురాసినా, ఎన్నో కథాసంపుటాలు వెలువరించినా కుహనా కథారచయిలు ఆయన ప్రతిభను గుర్తించలేదు. పత్రికలు ఆయన కథలను ప్రచురించలేదు. అయినా ఆయన బాధపడలేదు....

Sunday, February 28, 2016 - 13:09

`నా చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో `లాంటి చక్కని గేయాలతో సమాజంలో చైతన్యం వెల్లువెత్తించిన అభ్యుదయగేయకవి  చింతల యాదగిరి. ప్రచార పటాటోపాలకు దూరంగా ఉంటూ... సమాజంలోని ప్రతి దృశ్యానికి చలించిపోతూ పాటై కరిగిపోతుంటాడాయన. ఇటీవలే తీగో నాగో ఎన్నియలో అనే గేయసంపుటిని వెలువరించిన ప్రజాగేయ రచయిత ,గాయకులు చింతల యాదగిరి పై 10 టి.వి.ప్రత్యేక కథనం.

Sunday, February 28, 2016 - 12:14

వివిధ సాహితీ వేదికల వేడుకల విశేషాల్లేంటో వీడియోలో చూడండి.. 

Sunday, February 21, 2016 - 13:27

బిక్కి కృష్ణ గారు రచించిన 'కాలం నది ఒడ్డున' పుస్తకం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఆ వివేశాలు వీడియోలో చూడగలరు. 

Sunday, February 21, 2016 - 12:46

కోరస్, నెత్తుటి వెన్నెల, అక్షర కవాతు లాంటి కవితా సంపుటాలతో తెలుగు సాహిత్యంలోకి దూసుకొచ్చిన అభ్యుదయ కవిత్వపు చైతన్య కెరటం దామెర రాములు. వస్తు వైవిధ్యం,శిల్ప శోయగంతో ఆయన కవిత్వం రాస్తుంటారు. వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి దామెర రాములుపై ప్రత్యేక కథనం. తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Sunday, February 21, 2016 - 12:42

తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.ఇటీవల కాలంలో స్త్రీవాదం వెనుక బడిందన్న అపవాదును పటాపంచలు చేస్తూ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ స్థాయి సదస్సులు ఏర్పాటు చేస్తూ అన్ని ప్రాంతాల మహిళల సమస్యలపై చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబార్ లోని ఆంధ్ర మహిళా సభలో ప్ర.ర.వే. నిర్వహించిన జాతీయ సదస్సు విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Sunday, February 14, 2016 - 13:35

అరుణ్ సాగర్.. ఈ పేరుకో వైబ్రేషన్.. ఎలక్ట్రానిక్ మీడియాలో అతనో  సెన్సేషన్. కవిత్వాభిమానులకు ఇష్టమైన అబ్సెషన్. ఒక్కమాటలో చెప్పాలంటే అరుణ్ సాగర్ అంటే కొత్తదనం, సూటిదనం, ఓ విస్ఫోటనం, ప్రవహించే ఎర్రదనం. తెలుగు కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన కవి ఆయన. స్వర్ణ భస్మమురా మన కవిత, అలజడి చెందిన అక్షర సమూహమన్న  నిత్య నవయవ్వన కవి. సీలేరు ఒడ్డున విరుగుతున్న విల్లు ఫెటఫేటేల్ ధ్వానాల్...

Sunday, February 7, 2016 - 11:58

నాడు శంబూకుని శిరస్సు తెగిపడటం ఓ కుట్ర.. ఏకలవ్యుని బొటవ్రేలును గురుదక్షిణగా తెగ్గొట్టడం ఓ కుట్ర.. నేడు రోహిత్ ను ఆత్మహత్యకు పురికొల్పడం మరో కుట్ర. తరాలు మారుతున్నా.. మారని వివక్ష అనేక రూపాల్లో అన్ని దిక్కులనుండీ కబళిస్తుంటే విలవిల్లాడిన సున్నిత హృదయం అతనిది. ఎన్నో కలలతో ఆశలతో ఆశయాలతో యూనివర్సిటీలలో చదువుకోవాలని వచ్చిన దళిత విద్యార్థులు ఇలా అర్థాంతరంగా తనువులు చాలించడం...

Sunday, January 31, 2016 - 13:51

సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందా..? మనుషుల్లో మార్పును తీసుకొస్తుందా? ప్రజలను ఉద్యమాల బాట పట్టిస్తుందా? అంటే ఇలాంటి ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెప్పుకోవాలి. ఎందరో  కవులు రచయితలు, నాటకకర్తలు సమాజహితం కోసం రచనలు చేస్తూనే ఉన్నారు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. అలాంటి వారిలో  దెంచనాల శ్రీనివాస్ ఒకరు. కవి, నాటక రచయిత దెంచనాల శ్రీనివాస్ ప్రత్యేక కథనంతో పాటు కంటి...

Sunday, January 24, 2016 - 12:53

దళిత బహుజన భావజాలంతో అద్భుతమైన అభివ్యక్తితో కవిత్వం రాస్తున్నకవి యం వెంకట్. ఆయన రాసిన వర్జి కావ్యం సంచలనం సృష్టించింది. సముద్రం నేపథ్యంగా మత్స్యకారుల ఛిద్రమైన జీవన చిత్రాలకు అద్దం పట్టే కవిత్వం రాసిన అసలు సిసలైన కవి ఆయన. నల్గొండ జిల్లాకు చెందిన కవి వెంకట్ కవిత్వం ధిక్కార స్వరమై ఎగసింది. సాహితీ విశ్లేషకులు జి.లక్ష్మీనర్సయ్యగారి వ్యాఖ్యానంతో వెంకట్ పై ప్రత్యేక కథనం. మరిన్ని...

Sunday, January 24, 2016 - 12:51

సాహిత్యం సామాన్య ప్రజలను సైతం కదిలించాలి. వారిని ఆలోచింపజేయాలి. చైతన్యవంతులను చేయాలి. అన్యాయాలను అక్రమాలను ఎదిరించే ఉద్దీపన శక్తిగా పనిచేయాలి. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారెందరో మన మధ్యలో ఉన్నారు. ఈ పేరు వింటేనే ...కల్పన, దొంగల సంత, మహిత, పుష్పవర్ణమాసం మెుదలైన అద్భుత కథలు గుర్తొస్తాయి. నిశిత పరిశీలనతో, వాస్తవికత ఉట్టి పడే విధంగా కథలల్లడంలో ఆమె దిట్ట. ఆమె కేవలం కథలే...

Sunday, January 17, 2016 - 12:42

ఆధునిక తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి విమర్శకునిగా, ప్రముఖ కవిగా వెలుగొందిన అద్దేపల్లి రామ్మోహన్ రావు ఇటీవలే కన్ను మూశారు. తన 80ఏళ్ల జీవితంలో సుమారు 55 ఏళ్లు రచనలు చేసి ఎందరో కవులను, రచయితలను ప్రభావితం చేశారు. తన పాఠలతో… గజల్స్ గానంతో సాహితీ వేదికలను ఉర్రూతలూగించిన ఆయన గళం మూగబోయింది. అందరినీ ప్రేమించే అరుదైన వ్యక్తి, స్నేహశీలి, ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు అద్దేపల్లి...

Sunday, January 10, 2016 - 12:44

హైదరాబాద్ : భారతీయ సాహిత్యంలో ఎంతో వైవిద్యం, వైరుధ్యం ఉంది. అయితే అస్థితత్వ ఉద్యమాల నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి కవులు, రచయితలు వచ్చారు. ప్రపంచ సాహితీ పరిచయంతో వస్తు శిల్పాల్లో ఊహించని మార్పులు వచ్చాయి. రచయితలు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుని గుర్తింపు పొందారు. అలాంటి వారిలో బుకర్ ప్రైజ్ అందుకున్న అరవింద్ అడిగా ఒకరు. 2008లో బుకర్ ప్రైజ్ అందుకున్న...

Sunday, January 3, 2016 - 13:21

వనితా కవితా లత మనలేవు లేక జత అన్నాడో సినీ కవి. నిజమే సాహితీరంగంలో కృషిచేసే కవులకు కళాకారులకు ప్రోత్సాహం అవసరం. అలాంటి సాహితీ వేదికలు, సాంస్కృతిక సంస్థలు చాలా తక్కువగానే కనిపిస్తాయి. అలాంటి సంస్థల్లో ఖమ్మంజిల్లాకు చెందిన మువ్వా రంగయ్య పద్మావతీ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి. ఈ సంస్థ ప్రతి యేటా సుప్రసిద్ద కవులకు, కళాకారులకు  అవార్డులు ప్రదానం చేస్తోంది. ప్రముఖులు రాసిన పుస్తకాలను...

Pages

Don't Miss