ఏప్రిల్ 25నుండి అమల వెబ్ సిరీస్ ప్రసారం

Submitted on 24 April 2019
Akkineni Amala's New Web Series High priestess is Broadcasting on April 25th-10TV

అక్కినేని అమల చాలాగ్యాప్ తర్వాత ముఖానికి మేకప్ వేసుకున్నారు. బ్లూక్రాస్ పనుల్లో బిజీగా ఉండే అమల, జీ 5 ఆప్ వారు నిర్మించిన వెబ్ సిరీస్.. ' హై ప్రీస్టె‌స్'లో లీడ్ రోల్ చేసారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ని పుష్ప డైరెక్ట్ చేసారు. బ్రహ్మాజీ, వరలక్ష్మీ శరత్ కుమార్, సునైనా, బిగ్ బాస్ 2 ఫేమ్ నందిత, కిషోర్ తదితరులు నటించారు. కాన్సెప్ట్ నచ్చడంతోనే ఈ వెబ్ సిరీస్‌లో నటించానని అమల చెప్పారు. ఇందులో ఆమె మణి అనే క్యారెక్టర్ చేసారు..

గతంలో తాము నిర్మించిన పలు వెబ్ సిరీస్‌లు సక్సెస్ అయినట్టే, హై ప్రీస్టె‌స్ కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందని జీ 5 వారు ధీమాగా చెప్తున్నారు.
ఏప్రిల్ 25నుండి జీ 5 ఆప్‌లో హై ప్రీస్టె‌స్ స్ట్రీమింగ్ కానుంది.

High priestess
Akkineni Amala
High priestess is Broadcasting on April 25th

మరిన్ని వార్తలు