కాంబో ఓకే-మరి హిట్టో?

Submitted on 20 February 2019
Akhil’s next with Bommarillu Bhaskar-10TV

అక్కినేని అఖిల్ హీరోగా ముచ్చటగా మూడు ఫ్లాప్‌‌లు అందుకున్నాడు. యాక్టింగ్ వైజ్ ఇంప్రూవ్ అవుతున్నాడు, డ్యాన్స్ బాగా చేస్తున్నాడు వంటి కాంప్లిమెంట్స్ వస్తున్నా, సరైన స్టోరీ సెలెక్ట్ చేసుకోలేక పోతున్నాడనే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి.. గతకొద్ది రోజులుగా అఖిల్ నాలుగవ సినిమా గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. క్రిష్, శ్రీనువైట్ల పేర్లు వినబడ్డాయి. ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ లైన్‌లోకి వచ్చాడు. బొమ్మరిల్లుతో ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకున్న భాస్కర్, పరుగుతోనూ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చేసిన ఆరెంజ్, అతని కెరీర్‌ని అగాధంలో పడేసింది. ఒంగోలు గిత్త తర్వాత టాలీవుడ్‌లో కనబడలేదు భాస్కర్..

గతకొద్ది రోజుల నుండి గీతాఆర్ట్స్‌లో సినిమా చెయ్యబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అఖిల్, భాస్కర్ కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ అనుంబంధ సంస్థ, జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌పై, అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమా రూపొందనుంది. అఖిల్, భాస్కర్ ఇద్దరి ట్రాక్ రికార్డ్ ఏమంత బాలేదు. ఇద్దరూ కలిసి ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడితేనే తప్ప వర్కవుట్ కాదు.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సమ్మర్ నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Akhil Akkineni
GA2 Pictures
Allu Aravind
Bommarillu Bhaskar

మరిన్ని వార్తలు