బాలీవుడ్ హారర్ బ్రదర్స్ బయోపిక్ వస్తోంది!

Submitted on 8 November 2019
Ajay Devgn to make biopic on Ramsay Brothers

బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది.. ఇప్పటికే పలు బయోపిక్స్ సెట్స్‌పై ఉన్నాయి.. మరికొన్ని ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఇప్పటి వరకు సినీ నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, మాఫియా లీడర్స్ వంటి వారి జీవితాల ఆధారంగా బయోపిక్స్ రూపొందగా ఇప్పుడు ఫిలిం మేకర్స్ లైఫ్ స్టోరీతో బయోపిక్‌ తెరకెక్కనుంది. వాళ్లే  రామ్‌సే బ్రదర్స్‌..


బాలీవుడ్, ఆమాట కొస్తే ఇండియన్ సినీ ప్రేక్షకులకు హారర్‌ చిత్రాలను పరిచయం చేసింది.. పాపులర్‌ చేసింది దర్శకులు రామ్‌సే బ్రదర్సే అంటారు. వీరిని హారర్‌ బ్రదర్స్‌ అని కూడా పిలుస్తారు. ‘గెస్ట్‌హౌస్’, ‘వీరానా’, ‘పురానీ మందిర్’, ‘పురానా హవేలీ’, ‘దర్వాజా’, బంద్‌ దర్వాజా’ వంటి హారర్‌ చిత్రాలతో 1980ల కాలంలో  ప్రేక్షకులను భయపెట్టారు రామ్‌సే బ్రదర్స్‌. ‘దో గజ్ జమీన్ కే నీచే’ మూవీ వారి కెరీర్‌లో మైల్‌స్టోన్ అని చెప్పొచ్చు.. ఇప్పుడు వాళ్ల కథే స్క్రీన్‌ మీదకు రాబోతోంది. ఈ బయోపిక్‌ను నటుడు అజయ్‌ దేవగన్‌ నిర్మించనున్నాడు. రామ్‌సే బ్రదర్స్‌ జీవితకథను సినిమాగా రూపొందించడానికి అజయ్‌ రైట్స్ తీసుకున్నారు. రైటర్ రితేష్ షా ఈ కథకు మెరుగులు దిద్దుతున్నారు.

Read Also : ‘ది బాడీ’ ఫస్ట్ లుక్ : డిసెంబర్ 13 రిలీజ్

మూడు తరాల రామ్‌సే ఫ్యామిలీ కథ, వాళ్ల సినీ ప్రయాణం, కెరీర్‌లో వాళ్లు ఎదుర్కొన్న కష్టాలన్నీ ఈ సినిమాలో చూపించనున్నారట. ఇందులో అజయ్‌ దేవగన్‌ యాక్ట్‌ చేయరని తెలిసింది. రామ్‌సే బ్రదర్స్‌ మొత్తం ఏడుగురు. కుమార్‌ రామ్‌సే, కేషు రామ్‌సే, తులసీ రామ్‌సే, కరణ్‌ రామ్‌సే, శ్యామ్‌ రామ్‌సే, గంగూ రామ్‌సే, అర్జున్‌ రామ్‌సే. వీళ్లు దర్శకులు, నిర్మాతలు, ఎడిటర్లుగా సత్తా చాటారు.. మల్టీ టాలెంటెడ్ అన్నమాట.. ఇటీవలే శ్యామ్‌ రామ్‌సే చనిపోయారు. ఈయన్ని ‘హారర్‌ సినిమాలకు బాద్‌షా’ అని అంటారు. రామ్‌సే బ్రదర్స్‌లో మరో  సోదరుడు తులసీ రామ్‌సే గత ఏడాది కన్నుమూశారు.. ఈ బయోపిక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి..

Ramsay Brothers
Ramsay Brothers biopic
Ajay Devgn

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు