అజయ్ దేవ్‌గణ్ తండ్రి కన్నుమూత

Submitted on 27 May 2019
Ajay Devgn Father Veeru Devgan passed away

ప్రముఖ బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్, దర్శక, నిర్మాత వీరూ దేవ్‌గణ్ (మే 27) ఉదయం కన్నుమూసారు. ఈయన ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ తండ్రి.  వీరూ దేవ్‌గణ్‌కు భార్య వీణా దేవ్‌గణ్‌, అజయ్ దేవ్‌గణ్‌, అనిల్ దేవ్‌గణ్‌, నీలం దేవ్‌గణ్‌, కవిత దేవ్‌గణ్‌ సంతానం.. వీరూ, బాలీవుడ్‌లో పలు సినిమాలకు యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసి, ఫేమస్ స్టంట్ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

క్రాంతి, సౌరభ్, సింఘాసన్ వంటి సినిమాల్లో తెరపై తళుక్కుమన్నారు. నిర్మాతగా హిందూస్థాన్ కి కసమ్, దిల్ క్యా కరే, సింఘాసన్ సినిమాలు నిర్మించారు. తనయుడు అజయ్ దేవ్‌గణ్ హీరోగా, అమితాబ్ ఇంపార్టెంట్ రోల్ చేసిన హిందూస్థాన్ కి కసమ్ సినిమాకి డైరెక్టర్ ఆయనే. వీరూ దర్శకత్వం వహించిన ఒకే ఒక సినిమా ఇది. ఆయన మృతికి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. మే 27 సాయంత్రం వీరూ దేవ్ గణ్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Veeru Devgan
Ajay Devgn
Ajay Devgn Father Veeru Devgan passed away

మరిన్ని వార్తలు