నాట్ అలోడ్ : విమానంలో పైలట్ల లంచ్ బాక్సులపై నిషేధం!

Submitted on 19 June 2019
Air India may ban pilots from bringing own food after fight over washing lunchbox

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొత్త రూల్స్ తీసుకురానుంది. విమానంలో పైలట్ల లంచ్ బాక్సులపై నిషేధం విధించే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు పైలట్ల మధ్య వాగ్వాదం జరిగింది. విమానంలో లంచ్ చేసే సమయంలో కెప్టెన్, క్యాబిన్ సిబ్బంది మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ఘటన సోమవారం జరిగింది.

విమానం క్యాబిన్ లో మీల్స్ చేసిన అనంతరం సీటును క్లీన్ చేయమని ఒక పైలట్ మరో పైలట్ కు సూచించాడు. ఈ విషయంలో క్యాబిన్ సిబ్బంది, కెప్టెన్ గొడవకు దిగారు. మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లారు. పైలట్ల గొడవ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయింది.

పైలట్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘పైలట్ల గొడవపై సీరియస్ యాక్షన్ తీసుకున్నాం. త్వరలో విమానాల్లో లంచ్ బాక్స్ తీసుకురావద్దని పైలట్లకు సూచిస్తాం’ అని చెప్పారు. 

ఎయిర్ లైన్ విమానం AI772కు చెందిన అధికారి మాట్లాడుతూ.. బెంగళూరు నుంచి ఉదయం 11.40 గంటల ప్రాంతంలో కోల్ కతా బయల్దేరి వెళ్లాల్సి ఉంది. కానీ, పైలట్ల మధ్య గొడవ కారణంగా రెండు గంటల ఆలస్యం అయింది. గొడవ పడిన పైలట్ ను తొలగించి అతని స్థానంలో మరొకరిని ఎక్కించాం’ అని చెప్పారు. కెప్టెన్ టిఫిన్ చేసిన సీటును క్లీన్ చేయమని కేబిన్ సిబ్బంది అడిగారు.

అందుకు కెప్టెన్ నిరాకరిస్తూ దురుసుగా సమాధానం ఇవ్వడంతో గొడవకు దారితీసింది. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ మొదలైందని, కఠిన చర్యలు తీసుకున్నట్టు అధికారి చెప్పారు. మార్చి 27న ఎయిర్ ఇండియా.. విమానంలో పైలట్లు.. బర్గర్లు, సూప్స్ వంటి స్పెషల్ మీల్స్ ఆర్డర్ చేయవద్దని సూచనలు చేసింది. 

air india
lunchbox ban
own food
washing lunchbox
fight on Lunch box


మరిన్ని వార్తలు