డిజిటల్ రాజకీయం: ‘పొలిటికల్ యాడ్స్‌’పై ఫేస్‌బుక్ కొత్త టూల్  

Submitted on 7 February 2019
Ahead of Loksabha elections facebook launches political ad transparency tool in india

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీలతో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల ప్రకటనలపై మరింత పారదర్శకత ఉండేలా సోషల్ మీడియా సంస్థలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు ట్విట్టర్, గూగుల్ ఎలక్షన్ యాడ్స్ ట్రాన్స్ పరెన్సీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటుండగా.. ఫేస్ బుక్ కూడా అదేబాటలో వర్క్ ఔట్ చేస్తోంది. నకిలీ వార్తలు, నకిలీ ప్రకటనల విషయంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోషల్ మీడియా దిగ్గజాలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి.


ఇందుకోసం ఫేస్ బుక్ భారత్ లో గురువారం (ఫిబ్రవరి 7, 2019) ఓ కొత్త టూల్ ను ప్రవేశపెట్టింది. అదే.. యాడ్స్ రిలేటడ్ పాలిటిక్స్ టూల్. రాజకీయ ప్రకటనలపై పారదర్శకత పాటించే దిశగా ఫేస్ బుక్ ఈ టూల్ ను అందుబాటులోకి తెచ్చింది.  ఈ టూల్ ఆధారంగా ‘పొలిటికల్ యాడ్’ ఎవరు ఇచ్చారు.. ఎన్నికల ప్రకటనకు ఎంత ఖర్చు చేశారో యూజర్లకు వెంటనే తెలిసిపోనుంది. ‘‘ గురువారం నుంచి ఫేస్ బుక్ ప్లాట్ ఫాంపై ఇచ్చే పొలిటికల్ యాడ్స్ ఎవరూ పబ్లీష్ చేశారు. డిస్ క్లైమర్స్ పొలిటికల్ యాడ్ కు ఎంతవరకు ఖర్చు చేశారో యూజర్లు తెలుసుకోవచ్చు’’ అని తెలిపింది. ఇందులో డిస్ క్లైమర్ పేరు, అథరైజడ్ అడ్వటైజర్స్ పేరుతో పాటు రన్ చేసే ఫేస్ బుక్ పేజీ లేదా ఆర్గనైజేషన్ పేరును యాడ్ వెనుక డిసిప్లే చేయడం జరుగుతుంది. 
 

ఈసీ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందే..
ఎలక్షన్ ప్రకటన ఇచ్చే సమయంలో మరో ఆర్గనైజేషన్ పేరును చేర్చాలంటే అదనంగా క్రెడిన్షియల్స్ అవసరం ఉంటుంది. అంటే.. ఫోన్ నెంబర్, ఈమెయిల్, వెబ్ సైట్ లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ‘‘ఈ విధానం ఆర్గనైజేషన్ అథంటిక్ చేసేందుకు సాయపడుతుందని ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ ఆఫ్ ఇండియా శివనాథ్ థుక్రాల్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ లోనే ఫేస్ బుక్ తొలిసారి ఈ ప్రణాళికను ప్రకటించింది. అప్పటినుంచే అడ్వటైజర్లు తమ పొలిటికల్ యాడ్స్ ను రన్ చేసేందుకు మొబైల్ ద్వారా లొకేషన్, ఐడెంటిటీను వెరీఫై చేసుకోవడం ప్రారంభించారు.


అడ్వటైజర్లు స్వచ్చంధగా తమ పొలిటికల్ యాడ్స్ ను ఇచ్చేందుకు ఈ టూల్ కొత్త ఫీచర్లు ఫిబ్రవరి 21న ప్రారంభించనున్నట్టు ఫేస్ బుక్ తెలిపింది. పొలిటికల్ యాడ్ డిస్ క్లైమర్ పై ఎవరైనా క్లిక్ చేస్తే చాలు.. అది నేరుగా సెర్చబుల్ యాడ్ లైబ్రరీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడే ఈ యాడ్ క్రియేట్ చేసిన తేదీ, సమయం, యాడ్ పర్ ఫార్మాన్స్ డేటా, ఎన్ని ఇంప్రిషన్లు వచ్చాయి, ఎంత రేంజ్ లో ఖర్చుపెట్టారు.. ఎంత మంది ఈ యాడ్ ను చూశారు.. (వయస్సు, ఆడ లేక మగ, లోకేషన్) తెలుసుకోవచ్చు. అంతేకాదు.. డిస్ క్లైమర్ క్రెడిన్షియల్స్ కూడా యాడ్ లైబ్రరీలో బహిర్గతం అవుతాయని ఫేస్ బుక్ స్పష్టం చేసింది. 


Read Also:  ఎంపీకే షాక్ : సీఎం రమేష్ వాట్సాప్ బ్యాన్

Read Also:  ఫీచర్స్ సూపర్ అంట : జియో 3 కమింగ్ సూన్

Political Ad
Transparancy tool
Facebook
loksabha elections
india

మరిన్ని వార్తలు