జెర్సీలో ఆదాశర్మ ఐటమ్ సాంగ్

Submitted on 11 February 2019
Adah Sharma to Perform a Item Number in Jersey-10TV

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాధ్, రెబా మోనికా జాన్ హీరో, హీరోయిన్స్‌గా, మళ్ళీ రావా ఫేమ్.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందుతున్న పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా.. జెర్సీ.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. జెర్సీ ఫస్ట్‌లుక్, టీజర్‌కీ చక్కటి స్పందన వస్తుంది.  ఆదాశర్మ.. జెర్సీలో నాని పక్కన ఐటమ్ సాంగ్‌లో ఆడిపాడనుందని తెలుస్తుంది. హార్ట్ ఎటాక్, సన్నాఫ్ సత్యమూర్తి,  క్షణం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆదాశర్మ.. జెర్సీలోని స్పెషల్ సాంగ్‌లో నానితో కలిసి కాలు కదపనుందని వార్తలు వస్తున్నాయి.

హిందీతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తున్న ఆదా, రాజశేఖర్ కల్కి మూవీలో ఒక హీరోయిన్‌గా నటిస్తుంది. ఫిబ్రవరి 14 న, లవర్స్ డే స్పెషల్‌గా జెర్సీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చెయ్యనున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ : అనిరుధ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా, లిరిక్స్ : కృష్ణకాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.వెంకటరత్నం (వెంకట్).

వాచ్ టీజర్...
 
 

Natural Star Nani
Adah Sharma
Anirudh Ravichander
Goutham Tinnanuri
Sithara Entertainments

మరిన్ని వార్తలు