అబ్బాయిగా మారిన అదాశర్మ

Submitted on 24 May 2019
Actress Adah Sharma to Play a Guy in Man to Man

హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది అదా శర్మ.. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1920, ఫిర్, హసీ తో ఫసీ, కమాండో 2 వంటి హిందీ సినిమాలు చేసిన అదా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో 'మ్యాన్ టు మ్యాన్' అనే సినిమా చేస్తుంది. ఈ మూవీలో ఆమె లింగమార్పిడి చేయించుకున్న పురుషుడి పాత్రలో నటిస్తుంది.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ మీసాలు పెట్టుకుని దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. మ్యాన్ టు మ్యాన్‌లో నవీన్ కస్తూరియా హీరోగా నటిస్తున్నాడు. నవీన్, అదా అందచందాలని చూసి ఇష్టపడి ఆమెని పెళ్ళి చేసుకుంటాడు.. తీరా చూస్తే ఆమె లింగమార్పిడి చేయించుకున్న పురుషుడని తెలుస్తుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనేదే మ్యాన్ టు మ్యాన్ స్టోరీ.. ఇది ఛాలెంజింగ్ క్యారెక్టర్ కావడంతో ఒప్పుకున్నానని, ఈ టైపు రోల్స్ వస్తే ఏ భాషలోనైనా నటిస్తానని అదా శర్మ చెప్పుకొచ్చింది. 

Adah Sharma

మరిన్ని వార్తలు