సంక్రాంతి : అత్తగారింటికి సంపూర్ణేష్ బాబు..

Submitted on 16 January 2019
Actor Sampoornesh Babu Sankranti Celebrations In Therlumaddi Village

రాజన్న సిరిసిల్ల : సినీ నటుడు సంపూర్ణేష్ బాబు అత్తగారింటికి వచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో అత్తగారిల్లు తెర్లుమద్ది గ్రామానికి విచ్చేశారు. కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. సంపూర్ణేష్ బాబు వచ్చారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు తరలివచ్చారు. గ్రామస్తులతో ఉల్లాసంగా మాట్లాడిన సంపూర్ణేష్ బాబు...తన కుమార్తెలతో పాటుగా, చుట్టూ ప్రక్కల పిల్లలతో సరదాగా గడిపారు. 
అనంతరం ఆయన మాట్లాడుతూ...సంక్రాంతి పండుగకు తన అత్తగారు ఊరికి రావడం మొదటిసారి అని...ఎన్నోసార్లు ఇక్కడి రావాలని గ్రామస్తులు కోరినా తీరలేదన్నారు. ఇప్పటికి తీరిందని...పండుగ ఇక్కడ జరుపుకోవాలన్న ఆకాంక్షతో కుటుంబ  సభ్యులతో రావడం జరిగిందన్నారు. సంక్రాంతి పండుగ సందర్భముగా ప్రజలకు, గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు...అందరూ సుఖ సంతోషాలతో గడపాలని ఆయన కోరుకున్నారు.

Hero
Sampoornesh Babu
Sankranthi
celebrations
Therlumaddi
Village
sircilla

మరిన్ని వార్తలు