అమిత్ షా కి ప్రకాష్ రాజ్ కౌంటర్ :  నా తల్లి కన్నడ.. నా దేశం భారతదేశం

Submitted on 15 September 2019
actor, politician prakash raj fire over amit shahs hindi comments

సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. దక్షిణాదికి చెందిన వివిధ  రాజకీయ పార్టీల నేతలు అమిత్‌ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. డీఎంకే, అన్నాడీఎంకె, జేడీఎస్, కాంగ్రెస్, ఎంఐఎం తదితర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

తాజాగా విలక్షణ నటుడు  ప్రకాష్ రాజ్ స్పందించారు. ‘‘నా తల్లి కన్నడ.. నా దేశం భారతదేశం’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘నేను కన్నడిగను.. భారతీయుణ్ని.. హిందీ అమలు చేయడాన్ని నిలిపేయండి. మిస్టర్ .. హోమ్ బ్రేకర్.. జాతీయవాదం పేరుతో ఒకే మతం.. ఒకే భాష తెరపైకి తెచ్చారు. తర్వాత ఏంటి’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

కాగా...  సెప్టెంబర్ 14 శనివారం  హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన  ట్వీట్ లో "దేశ‌మంతా ఒకే భాష ఉండాల‌న్న ఉద్దేశాన్ని తెలిపారు.దేశమంతా ఒకే భాష ఉండాలనీ..అది హిందీ భాష అయి ఉండాలన్నారు. దేశాన్ని ఏకం చేసే సామర్ధ్యం ఉన్న భాష హిందీ అని అన్నారు. హిందీని దేశ‌భాష‌గా గుర్తించాల‌ని ఆయ‌న షా అభిప్రాయపడ్డారు. భార‌త దేశంలో ఎన్నో భాష‌లు ఉన్నాయ‌ని.. ప్ర‌తి భాషాకూ ప్ర‌త్యేక‌త ఉంద‌న్న ఆయన దేశ ప్ర‌జ‌ల కోసం ఒకే భాష ఉండాల‌ని..అదే భారతదేశానికి..మనకు గుర్తింపుగా మారాల‌ని షా తెలిపారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఒకే భాష అవ‌స‌రమన్న షా..దేశంలోని ప్రజలు ఎక్క‌ువ సంఖ్య‌లో హిందీలోనే మాట్లాడుతున్నార‌ని ట్వీట్ చేశారు. 

 

 

amith shaw
Hindi language
prakash raj
Twitter
Kannada
actor
politician

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు