ఏసీబీకి చిక్కన మహేశ్వరం ఎస్సై నరసింహు 

Submitted on 21 February 2019
ACB Arrested Maheshwaram si Narasimhu

హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో పోలీస్ చేప చిక్కింది. అవినీతికి పాల్పడుతు పలువురిని డబ్బుల కోసం వేధించే ఎస్సై అవినీతికి చెక్ పెట్టారు ఏసీబీ అధికారులు. మహేశ్వరం పోలీసు స్టేషన్ ఎస్‌ఐ నరసింహు రూ. 80 వేలు లంచం తీసుకుంటు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. ఓ దొంగతనం సరుకును కొనుగోలు చేసిన వ్యక్తిని  ఎస్‌ఐ లంచం కోసం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన ఏసీబీ నరసింహు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.


మరిన్ని వార్తలు