తాత ఒడిలో కూర్చొన్న మంత్రిగారిని గుర్తుపట్టారా

Submitted on 23 January 2020
Aaditya Thackeray's Throwback Pic On Bal Thackeray's Birth Anniversary

మరాఠాల హక్కులే ఊపిరిగా బతికిన శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే పుట్టిన రోజు నేడు. 1926లో పూణేలో జన్మించిన బాల్ ఠాక్రే 86ఏళ్ల వయస్సులో 2012లో ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ బాల్ ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా  తాతను గుర్తుచేసుకున్నారు ఆదిత్యఠాక్రే. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన తాత ఫొటోలను ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉండే ఆదిత్య ఠాక్రే...చిన్నవయస్సులో తాతతో గడిపిన క్షణాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

	ADITHYA_1.JPG

29ఏళ్ల మహారాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే. తాతా బాల్ ఠాక్రేతో చిన్నవయస్సులో దిగిన పలు ఫొటోలను ఇవాళ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆదిత్య ఠాక్రే ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వేల లైక్ లు,కామెంట్లు వచ్చాయి. మీరెప్పుడూ మా గుండెల్లో ఉంటారు అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా,మహారాష్ట్రలో బాలా ఠాక్రేలా ఇంకెవ్వరూ ఉండరని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. బాల్ ఠాక్రే వారుసుడిగా ఆయన ఆశయాలను ఆదిత్య ఠాక్రే ముందుకుతీసుకెళతారని భావిస్తున్నామంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

	ADITHYA 3_0.JPG

1966లో శివసేన స్థాపించబడినప్పటి నుంచి 2019వరకు ఠాక్రేల కుటుంబసభ్యులు ఎన్నికల్లో పోటీ చేయలేదు.  బాల్ ఠాక్రే,ఆయన కుమారుడు ఉద్దవ్ ఠాక్రే రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో ఠాక్రే కుటుంబం నుంచి మొదటిసారిగా ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ముంబైలోని వర్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి బంపర్ మెజార్టీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టి తండ్రి కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

	ADITHYA 4.JPG

 

ADITHYA THACKERAY
BAL THACKERAY
Birth Day
photos
grandfather
Shares
memories

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు