మళ్లీ పెళ్లి చేసుకున్న 'యువరాజ్ సింగ్'..

11:23 - December 3, 2016

ప్రముఖ క్రికేటర్ 'యువ రాజ్ సింగ్' మళ్లీ పెళ్లి చేసుకున్నాడా ? మొన్ననే గదా ప ఎళ్లి చేసుకుంది. అంటూ ఏవోవో అనుకుంటున్నారా ? అవేమీ కాదండి. మూడు రోజుల క్రితం సిక్కుల సంప్రదాయం ప్రకారం టీమిండియా ఆట‌గాడు యువరాజ్‌ సింగ్‌, బాలీవుడ్‌ నటి హజల్‌ కీచ్‌ ల పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు ప్రముఖులు విచ్చేశారు. తాజాగా 'యువీ' హిందూ సంప్రదాయం ప్రకారం 'హజల్ కీచ్'ను మళ్లీ వివాహం చేసుకున్నాడు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఈ తంతు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో వధూ వరుల కుటుంబసభ్యులు కొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. సిక్కు సంప్రదాయంతో పాటు హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగిందన్నమాట. ఇదిలా ఉంటే ఈనెల 7వ తేదీన ఢిల్లీలో 'యువీ' పెళ్లి విందు నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటులు బిగ్ బి అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ తో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరు కానున్నట్లు సమాచారం. 

Don't Miss